Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చిన విషయం గురించే చర్చలు నడుస్తున్నాయి. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కు పంపిం 52 రోజులు రాజమండ్రి జైలులో పెట్టారు. దానిపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కావాలని చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు సాగిస్తోందని అంటున్నారు. తాజాగా నారా లోకేష్.. చంద్రబాబు విషయంపై రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈరోజు టీడీపీ బృందం గవర్నర్ గారిని కలిశాం. గవర్నర్ గారికి చాలా స్పష్టంగా జగన్ లో నరనరాన కక్ష సాధింపు తప్ప ఏం లేదని స్పష్టంగా ఆధారాలతో సహా చూపించాం. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలపై ఆయన కక్ష సాధింపు ఎలా చేస్తున్నారో, ఎలా అచ్చెన్నాయుడు కానీ.. కొల్లు రవీంద్రా కానీ.. నరేంద్ర కానీ ఏం తప్పు చేయకపోయినా 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు, 80 రోజులు జైలుకు ఎలా పంపించారో గవర్నర్ కి చెప్పాం అన్నారు.
తాడిపత్రిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపైన ఎలా 100 కేసులు పెట్టి నిన్న మొన్న కూడా ఒక కేసు పెట్టి వేధిస్తున్నారని చెప్పాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 260 కేసులు టీడీపీ సీనియర్ నాయకులపై ఎలా పెట్టారో కూడా వివరాలతో సహా మేము గవర్నర్ కు ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై 60 వేల కేసులు ఎలా పెట్టారో కూడా గవర్నర్ కు చూపించడం జరిగింది. నేను యువగళం పాదయాత్ర చేసినప్పుడు నాపై, నాయకులపై, వాలంటీర్లపైన ఎలా కేసులు బనాయించారో గవర్నర్ కు చెప్పాం. ఇంకో పక్క దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడుపై దొంగ కేసులు పెట్టి ఆధారాలు లేకపోయినా 17 ఏ పర్మిషన్ లేకపోయినా ఆయన్ను ఎలా సతాయించారు.. ఎలా జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించారో కూడా గవర్నర్ కు వివరించాం అని లోకేష్ చెప్పారు.
చాలా స్పష్టంగా రూ.3 వేల కోట్ల అవినీతి అని చెప్పారు. ఆ తర్వాత 370 కోట్ల అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల అవినీతి అని చెప్పారు. అది కూడా పార్టీ అకౌంట్లో ఎక్కడో డబ్బులు పడ్డాయని చెప్పి ఎలా ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడును ఇబ్బంది పెట్టిందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ ఆనాడు రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు ఎలా అడ్డుపడ్డారో కూడా చెప్పాం. ప్రజలపై కూడా ముఖ్యమంత్రి ఎలా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో చెప్పాం. అమర్ నాథ్ గౌడ్ గురించి కూడా దృష్టికి తీసుకెళ్లాం. శ్యామ్ కుమార్ దళిత యువకుడిపై వైసీపీ నాయకులు ఎలా ప్రవర్తించారో చెప్పాం. పదో తరగతి పాపకు టీసీ ఇచ్చి పంపించారు. దీంతో ఆ పాప ఆత్మహత్య చేసుకుంది. వైసీపీ నేత కూతురుకు రెండో ర్యాంక్ వస్తుందని ఆ పాపకు టీసీ ఇచ్చి పంపిస్తే ఆ అమ్మాయి లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. వైసీపీ నేతలు ఎలాంటి దారుణాలు చేశారో ఆయన దృష్టికి తీసుకెళ్లాం అని నారా లోకేష్ స్పష్టం చేశారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.