Nara Lokesh : జగన్‌లో నరనరాన మాపై కోపం ఉంది.. చంద్రబాబును పవన్‌ కలిస్తే జగన్‌కు ఉచ్చ పడిపోయింది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nara Lokesh : జగన్‌లో నరనరాన మాపై కోపం ఉంది.. చంద్రబాబును పవన్‌ కలిస్తే జగన్‌కు ఉచ్చ పడిపోయింది

Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చిన విషయం గురించే చర్చలు నడుస్తున్నాయి. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కు పంపిం 52 రోజులు రాజమండ్రి జైలులో పెట్టారు. దానిపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కావాలని చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు సాగిస్తోందని అంటున్నారు. తాజాగా నారా లోకేష్.. చంద్రబాబు విషయంపై రాష్ట్ర గవర్నర్ ను కలిసి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :8 November 2023,9:00 pm

ప్రధానాంశాలు:

  •  గవర్నర్ ను కలిసిన నారా లోకేష్, టీడీపీ నాయకులు

  •  వైసీపీ నేతల అరాచకాలపై గవర్నర్ కు నివేదిక

  •  పవన్ ను రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్న విషయం గవర్నర్ కు తెలిపిన లోకేష్

Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చిన విషయం గురించే చర్చలు నడుస్తున్నాయి. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కు పంపిం 52 రోజులు రాజమండ్రి జైలులో పెట్టారు. దానిపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కావాలని చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు సాగిస్తోందని అంటున్నారు. తాజాగా నారా లోకేష్.. చంద్రబాబు విషయంపై రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈరోజు టీడీపీ బృందం గవర్నర్ గారిని కలిశాం. గవర్నర్ గారికి చాలా స్పష్టంగా జగన్ లో నరనరాన కక్ష సాధింపు తప్ప ఏం లేదని స్పష్టంగా ఆధారాలతో సహా చూపించాం. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలపై ఆయన కక్ష సాధింపు ఎలా చేస్తున్నారో, ఎలా అచ్చెన్నాయుడు కానీ.. కొల్లు రవీంద్రా కానీ.. నరేంద్ర కానీ ఏం తప్పు చేయకపోయినా 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు, 80 రోజులు జైలుకు ఎలా పంపించారో గవర్నర్ కి చెప్పాం అన్నారు.

తాడిపత్రిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపైన ఎలా 100 కేసులు పెట్టి నిన్న మొన్న కూడా ఒక కేసు పెట్టి వేధిస్తున్నారని చెప్పాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 260 కేసులు టీడీపీ సీనియర్ నాయకులపై ఎలా పెట్టారో కూడా వివరాలతో సహా మేము గవర్నర్ కు ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై 60 వేల కేసులు ఎలా పెట్టారో కూడా గవర్నర్ కు చూపించడం జరిగింది. నేను యువగళం పాదయాత్ర చేసినప్పుడు నాపై, నాయకులపై, వాలంటీర్లపైన ఎలా కేసులు బనాయించారో గవర్నర్ కు చెప్పాం. ఇంకో పక్క దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడుపై దొంగ కేసులు పెట్టి ఆధారాలు లేకపోయినా 17 ఏ పర్మిషన్ లేకపోయినా ఆయన్ను ఎలా సతాయించారు.. ఎలా జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించారో కూడా గవర్నర్ కు వివరించాం అని లోకేష్ చెప్పారు.

Nara Lokesh : అప్పుడు రూ.3 వేల కోట్ల అవినీతి అన్నారు..  ఇప్పుడు 370 కోట్లు అంటున్నారు

చాలా స్పష్టంగా రూ.3 వేల కోట్ల అవినీతి అని చెప్పారు. ఆ తర్వాత 370 కోట్ల అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల అవినీతి అని చెప్పారు. అది కూడా పార్టీ అకౌంట్లో ఎక్కడో డబ్బులు పడ్డాయని చెప్పి ఎలా ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడును ఇబ్బంది పెట్టిందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ ఆనాడు రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు ఎలా అడ్డుపడ్డారో కూడా చెప్పాం. ప్రజలపై కూడా ముఖ్యమంత్రి ఎలా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో చెప్పాం. అమర్ నాథ్ గౌడ్ గురించి కూడా దృష్టికి తీసుకెళ్లాం. శ్యామ్ కుమార్ దళిత యువకుడిపై వైసీపీ నాయకులు ఎలా ప్రవర్తించారో చెప్పాం. పదో తరగతి పాపకు టీసీ ఇచ్చి పంపించారు. దీంతో ఆ పాప ఆత్మహత్య చేసుకుంది. వైసీపీ నేత కూతురుకు రెండో ర్యాంక్ వస్తుందని ఆ పాపకు టీసీ ఇచ్చి పంపిస్తే ఆ అమ్మాయి లేఖ రాసి ఆత్మహత్య  చేసుకుంది. వైసీపీ నేతలు ఎలాంటి దారుణాలు  చేశారో ఆయన దృష్టికి తీసుకెళ్లాం అని నారా లోకేష్ స్పష్టం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది