Narendra Modi : చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్… వైయస్ జగన్ కి మోడీ నుంచి ఫోన్ కాల్..!
ప్రధానాంశాలు:
Narendra Modi : చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్... వైయస్ జగన్ కి మోడీ నుంచి ఫోన్ కాల్..!
Narendra Modi : ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంటరిగా పోరు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఎవరు గెలుస్తారు అనేదానిపై ఉత్కంఠత పెరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇరు వర్గాల పార్టీలలో టెన్షన్ నెలకొంది. ఇక వైయస్ జగన్ ఒంటరిగా తన వ్యూహరచన చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల కంటే ముందుగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలలో పూర్తిస్థాయిలో నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించలేదు. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన సీట్ల విషయంలో బిజీగా ఉన్నాయి. ఇక మరోవైపు వైఎస్ జగన్ సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే వైయస్ జగన్ నిర్వహించిన నాలుగు సిద్ధం సభలు గ్రాండ్ గా సక్సెస్ అయ్యాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక తాజాగా జరిగిన నాలుగవ సిద్ధం సభ గత సభలలాగే గ్రాండ్ సక్సెస్ అయింది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిద్ధం సభలు ముగిశాయి. మార్చి 10న మేదరమెట్లలో సిద్ధం భారీ బహిరంగ సభ చాలా గ్రాండ్ గా జరిగింది. టీడీపీ కి అతిపెద్ద కంచుకోటగా చెప్పుకొనే ఈ ప్రాంతంలో సిద్ధం సభ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అయితే ఈ సిద్ధం సభ ప్రారంభానికి రెండు మూడు గంటల ముందు ఢిల్లీ నుంచి వైయస్ జగన్ కు ఫోన్ కాల్ వచ్చిందని వైసీపీ వర్గాలలో రూమర్స్ సంచలనంగా మారాయి. అయితే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. జేపీ నడ్డా పేరిట బీజేపీ అధికారికంగా పొత్తును ప్రకటించింది. అయితే వైసీపీ వర్గాలు చెప్పిన దాని ప్రకారం కేంద్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్న విజయ్ సాయి రెడ్డి ద్వారా ఏపీ పరిస్థితుల దృష్ట్యా ఎన్డీఏలోకి వైయస్ జగన్ రిలీజియన్స్ కారణంగా తీసుకోలేని పరిస్థితి వలన చంద్రబాబుతో ముందుకు వెళ్లాల్సి వస్తుందని,
ఒకవేళ వైసీపీ గెలిస్తే తమకు ఎంపీ సీట్లు గతంలో ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని బీజేపీ కోరినట్లు చెబుతున్నారు. గతంలో వైసీపీ ఎంపీలు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేశారు. ఆయన ప్రవేశపెట్టిన బిల్లులను మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే వైసీపీ తో ఉన్న సాన్నిహిత్యంతో వైయస్ జగన్ కు నరేంద్ర మోడీ ఫోన్ చేశారని అంటున్నారు. గతంలో బిజెపికి వైసిపి సపోర్ట్ చేసినట్లుగానే ఇప్పుడు కూడా అధికారంలోకి వైసీపీ వస్తే ఎంపీ సీట్ల విషయంలో బిజెపికి సపోర్ట్ చేయాలని నరేంద్ర మోడీ వైయస్ జగన్ కు ఫోన్ చేసి మరి చెప్పారట. ఏది ఏమైనా ప్రతిపక్షాలన్నీ ఒకటే వైయస్ జగన్ ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి 2024 ఎన్నికల్లో వైయస్ జగన్ గెలుస్తారా లేదా కూటమిగా ఏర్పడ్డ ప్రతిపక్షాలు గెలుస్తాయా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.