Chandrababu : ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన పతకాలను ప్రజలకు అందించే విధంగా పనులు చేస్తుంది. ఐతే పెన్షన్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి పెద్ద హెడేక్ గా మారిందని తెలుస్తుంది. ఇదివరకు కన్నా 1000 రూపాయలు అదనంగా పెన్షన్ ఇచ్చేలా హామీ ఇవ్వగా నెలకు 4 వేలు చూపున దాదాపు రాష్ట్రం మొత్తం మీద 65 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారట.వీటికోసం నెల నెల ప్రభుత్వం 3500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఐతే పెన్షన్ గురించి ఏపీ ప్రభుత్వం మరో ఆలోచన చేసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఐతే రాష్ట్రంలో కొన్ని నకిలీ పెన్షన్ తీసుకుంటున్న వారున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దాదాపు రెండున్నర లక్షల మంది దాకా పెన్షన్ ని అర్హత లేకుండానే పొందుతున్నారని ప్రభుత్వానికి ఒక నివేదిక వచ్చింది.ఈ టైంలో చంద్రబాబు ప్రబుత్వం పెన్షన్ తీసుకునే వారి టోటల్ రిపోర్ట్ సిద్ధం చేయాల్సి ఉంది. వీరిలో అర్హత లేని వారిని ఈ లిస్ట్ నుంచి తొలగించాలని చూస్తున్నారు. ఐతే గత ప్రభుత్వం ఇవేవి చూడకుండా ఇచ్చింది కాబట్టి ఒకవేళ అనర్హత కలిగిన ప్రజలు పెన్షన్ కోసం ప్రభుత్వంపై గొడవ చేసే అవకాశం ఉంటుంది.
ఎలాగు పెన్షన్ ఇస్తామని అన్నారు కాబట్టి మళ్లీ వెనక్కి తగ్గలేదు.. కానీ ముందుకు వెళ్లాలంటే మాత్రం ప్రతి నెల 3500 కోట్ల రాష్ట్ర ఖజానా నుంచి ఖాళీ అవుతాయి. ఇవే కాదు రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్ కూడా దీనిపై భారీ పడేలా చేస్తుంది. అందుకే ఏపీ ప్రభుత్వం పెన్షన్ విదివిధానాల మీద మరింత ఫోకస్ చేస్తుంది. మరి బాబు ప్రభుత్వం పెన్షన్ విషయంలో ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. కచ్చితంగా నిర్ణయం ఏదైనా ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. పెన్షన్ ప్లానింగ్ తోనే బాబు తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఇదే కాదు ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నారని అర్ధమవుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.