Nimmagadda Ramesh : మళ్లీ నిమ్మగడ్డకు బిగుసుకున్న ఉచ్చు..!
Nimmagadda Ramesh : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ప్రస్తుతం ఉన్న అధికారులు మొత్తం కూడా సలాం కొడుతూ ఆయన ఆదేశాల అనుసారంగా పని చేస్తుంటే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ మాత్రం తిరుగుబాటు చేశాడు. జగన్ కావాలన్నప్పుడు వద్దని.. వద్దనుకున్నప్పుడు కావాల్సిందే అంటూ ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ నిర్వహించాడు. గత ఏడాది మార్చిలో ఎన్నికలను అర్థాంతరంగా ఆపేయడం వల్ల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా ఫీల్ అయ్యాడు. కనీసం ప్రభుత్వంలో ఉన్న తమకు సమాచారం ఇవ్వాలి కాదా సీఎం అయిన తాను కూడా మీడియా ద్వారా తెలుసుకోవాల్సి వచ్చింది అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా ఆగ్రహంతో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన్ను పీకి పారేశాడు. అయితే కోర్టుకు వెళ్లి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పోరాడి మరీ మళ్లీ తన పదవిని తెచ్చుకున్నాడు.
నిమ్మగడ్డ రమేష్ అనుకున్నది అనుకున్నట్లుగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాడు. ఏకగ్రీవం చేసేందుకు వైకాపా నాయకులు ప్రయత్నిస్తూ ఉంటే వారిని అడ్డుకున్నాడు. కోర్టులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు పదే పదే మొట్టికాయలు పడేలా నిమ్మగడ్డ రమేష్ చేశాడు. అందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనపై చాలా కోపంగా ఉండి ఉంటారు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైనే కాకుండా మంత్రులపై కూడా నిమ్మగడ్డ ప్రతాపం చూపించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి మరియు బొత్సాలపై తన పవర్ ను ఉపయోగించి ఆంక్షలు విధించాడు. ఒక ఎమ్మెల్యే పై ఆంక్షలు విధించడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కు రుచి చూపించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు.

nimmagadda ramesh
అసెంబ్లీ స్పీకర్ కు తమ సభా హక్కులకు భంగం కలిగించేలా నిమ్మగడ్డ రమేష్ వ్యవహరించాడంటూ ఫిర్యాదు ఇచ్చారు. స్పీకర్ ఖచ్చితంగా నిమ్మగడ్డ పై చర్యలు తీసుకోవడం ఖాయం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల కోసం స్పీకర్ వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు నిమ్మగడ్డ హాజరు అవ్వాల్సిందిగా నోటీసులు అందాయి. దాంతో ఆయన పై తప్పు తేలడం ఖాయం అలాగే జైలుకు వెళ్లడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పెట్టుకుంటే నిమ్మగడ్డ రమేష్ విషయంతో తేట తెల్లం అవుతుంది అంటూ వైకాపా నాయకులు అంటున్నారు.