Rahul Gandhi : చిక్కుల్లో రాహుల్… నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..!
ప్రధానాంశాలు:
Rahul Gandhi : చిక్కుల్లో రాహుల్... నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..!
Rahul Gandhi : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు షాక్ ఇచ్చింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26న తప్పనిసరిగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. రాహుల్ తరఫున హాజరైన లాయర్, వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరగా, కోర్టు దాన్ని తిరస్కరించింది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

Rahul Gandhi : చిక్కుల్లో రాహుల్… నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..!
Rahul Gandhi రాహుల్ కు షాక్ ఇచ్చిన ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు
ఈ కేసు 2018లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో సంబంధం కలిగి ఉంది. అప్పట్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై చేసిన విమర్శల్లో, హత్య కేసులో ఆరోపణలు ఉన్నవారికూడా బీజేపీ అధ్యక్షులు అవుతారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసినవి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, జార్ఖండ్ బీజేపీ నేత ప్రతాప్ కటియార్ చైబాసా కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ కేసు జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు రాంచీ, తదుపరి చైబాసాలోకి బదిలీ అయింది.
కేసు విచారణలో కోర్టు పలు మార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, రాహుల్ గాంధీ హాజరుకాకపోవడంతో ముందుగా బెయిలబుల్ వారెంట్, అనంతరం హైకోర్టులో ఆయన దాఖలు చేసిన స్టే పిటిషన్ తిరస్కరణ అనంతరం, చైబాసా కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం కీలక మలుపుగా మారింది. ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కేసు పలు రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు దారి తీయనుంది.