India Pakistan : S-400 ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం : కల్నల్ సోఫియా ఖురేషి

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 10, 2025, 2:00 pm
  •  India Pakistan : S-400 ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం : కల్నల్ సోఫియా ఖురేషి

India Pakistan : భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత నాలుగో రోజు కూడా పాకిస్థాన్‌ దుశ్చర్యలకు పాల్పోడుతుంది. భారత్​ దీటుగానే బదులిస్తోంది. ప్రసిద్ధ క్షేత్రాలు లక్ష్యంగా పాకిస్థాన్​ దాడులు చేస్తోంది, ప్రసిద్ధ శంభూ ఆలయం లక్ష్యంగా పాక్‌ దాడులు చేసింది, జమ్ములోని జనావాసాలపైనా పాక్‌ దాడులు చేసింది అని ర‌క్ష‌ణ శాఖ తెలియ‌జేసింది. S- 400 ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేసింది అని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు.

India Pakistan : S-400 ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం : కల్నల్ సోఫియా ఖురేషి

India Pakistan : S-400 ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం : కల్నల్ సోఫియా ఖురేషి

India Pakistan త‌ప్పుడు ప్ర‌చారాలు..

పాకిస్థాన్ రెచ్చగొడుతూ దాడులు కొనసాగిస్తూనే ఉంది. 24 చోట్ల ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించింది. శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్‌ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై భారత్ ప్రతిదాడులు చేసింది. S-400ను ధ్వంసం చేశామంటూ పాక్ తప్పుడు ప్రచారం చేస్తుంద‌ని కల్నల్ సోఫియా ఖురేషి స్ప‌ష్టం చేశారు.

పాకిస్థాన్‌లోని 4 ఎయిర్‌బేస్‌లపై మనం డ్రోన్‌ దాడులు చేశాం, పాకిస్థాన్‌కు చెందిన ఏడీ రాడార్‌ను డ్రోన్లు ధ్వంసం చేశాయి అని సోఫియా ఖురేషి అన్నారు. పాకిస్థాన్ సైనిక బలగాలు ముందుకు వస్తున్నట్లు గమనించాం. పాకిస్థాన్‌ తన అసత్య ప్రచారాలను కొనసాగిస్తోంది. భారత్‌లోని పలు ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్లు పాక్‌ చేస్తున్న ప్రచారం అవాస్తవం. పాక్‌ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో తిప్పికొట్టారు భార‌త సైన్యాధికారులు.

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp