Pakistan Youth : భారత్ సైన్యాన్ని ఆకాశానికి ఎత్తుతున్న పాక్ యువత.. ఆ కిక్కే వేరప్పా..!
ప్రధానాంశాలు:
Pakistan Youth : భారత్ సైన్యాన్ని ఆకాశానికి ఎత్తుతున్న పాక్ యువత.. ఆ కిక్కే వేరప్పా..!
Pakistan Youth : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్‌లో 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నందుకు భారత సైన్యం జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలని నేలమట్టం చేశాయి. వీటికి సంబంధించిన వీడియోలను సైతం భారత ఆర్మీ విడుదల చేసింది. ఈ ఆక్యురేట్ దాడి పట్ల పాకిస్తాన్ యువత సైతం ప్రశంసించకుండా ఉండలేకపోతోంది.

Pakistan Youth : భారత్ సైన్యాన్ని ఆకాశానికి ఎత్తుతున్న పాక్ యువత.. ఆ కిక్కే వేరప్పా..!
Pakistan Youth : పాక్ సభ్యులు ప్రశంసలు..
చీకట్లో భారత వైమానిక బలగాలు 95 శాతం లక్ష్యాలను ఛేదించగలిగాయంటూ అభినందిస్తోంది. అదే సమయంలో తమ దేశ ఆర్మీ వైఫల్యాన్ని ఎండగడుతోంది. బుధవారం తెల్లవారు జామున పాకిస్తాన్‌పై భారత్ 24 మిస్సైళ్లను సంధించిందని, అవన్నీ కూడా చాలా అక్యురేట్‌గా లక్ష్యాన్ని ఛేదించాయని పాకిస్తాన్ కు చెందిన ఓ యువకుడు ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో పాకిస్తాన్ ఆర్మీ ఏ ఒక్క మిస్సైల్‌ను ఇంటర్‌సెప్ట్ చేయలేకపోయిందని, ఒక్క దాన్ని కూడా అడ్డుకోలేకపోయామని, ఇది తమ దేశ రక్షణ వ్యవస్థ వైఫల్యమంటూ నిప్పులు చెరిగాడు.
పాకిస్తాన్‌లో ఉంటూ భారత్‌ను పొగడుతున్నాడంటూ తనను తప్పుపట్టినా సరే.. వాస్తవాన్ని అంగీకరించక తప్పదని అన్నాడు. వందలు, వేల సంఖ్యలో మిస్సైళ్లు ఇజ్రాయెల్‌పై సంధించినప్పటికీ అందులో కొన్ని మాత్రమే టార్గెట్‌కు చేరుకుంటాయని, మిగిలిన వాటిని ఆ దేశ రక్షణ వ్యవస్థ నేలకూల్చుతుందని ఆ యువకుడు గుర్తు చేశాడు. మరో యువకుడు పెషావర్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను షేర్ చేశాడు. భారత్ దాడులను దృష్టిలో పెట్టుకుని ఇస్లామాబాద్‌కు వెళ్లాల్సిన విమానాన్ని పెషావర్‌కు మళ్లించారు. కాని ఇక్కడ అంతా సవ్యంగా ఉన్నట్లు పాక్ మీడియా గానీ, అధికారులు గానీ చెప్పడం ఏంటో అని మరో యువకుడు అన్నాడు.