
patamsetti suryachandra disappointed over jyothula nehru words
Patamsetti Suryachandra : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా టీడీపీ, జనసేన పొత్తు గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు జైలులో ఉండగా.. అక్కడికి వెళ్లిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబు దీనస్థితిని చూసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పుకొచ్చారు. రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని.. ఇక నుంచి టీడీపీ, జనసేన వేరు కాదని.. రెండు పార్టీల అభిమతం, లక్ష్యం ఒక్కటే అని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి టీడీపీ, జనసేన నేతలు కూడా కలిసి పని చేస్తున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీ, జనసేన నేతల మధ్య చాలా గొడవలు వస్తున్నాయి. సీఎం అభ్యర్థి విషయంలో, ఇతర పదవుల విషయాల్లో రెండు పార్టీల నేతలు కొట్టుకుంటున్నారు. దీంతో టీడీపీ, జనసేన హైకమాండ్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తాజగా జనసేన నేత పాటంశెట్టి సూర్యచంద్ర ఇదే విషయం గురించి మీడియాతో మాట్లాడారు. ఇటీవల టీడీపీ, జనసేన నేతల సమావేశంలో స్టేజీ మీద జరిగిన గొడవ గురించి ఆయన స్పందించారు.
టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ.. అందరి ముందే వేలాది మంది జన సైనికులు అక్కడే ఉన్నారు. టీడీపీ నేతలు అక్కడే ఉన్నారు. అక్కడే జగ్గంపేట నియోజకవర్గంలో జనసేనకు టికెట్ ఇవ్వమని.. ఒకవేళ ఇస్తే మేము పాటంశెట్టి సూర్యచంద్రకు మద్దతు ఇవ్వమని.. ఆయన గెలుపు కోసం మేము కష్టపడమని డైరెక్ట్ గా చెప్పేశారు. జనసేన పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకూడదని చెప్పడంతో మేము అందరం తలదించుకొని సిగ్గుతో బయటికి వచ్చాం. 2019 ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా రాత్రి పగలు జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజా సమస్యల మీద మేము ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. కానీ.. ఈ రోజు జనసేన పార్టీని అణగదొక్కడానికి, జనసేన పార్టీ ఇక్కడ లేకుండా చేయడానికి ఆయన బహిరంగంగానే ప్రయత్నం చేయడం జరిగిందన్నారు.
రైతన్నల కోసం నేను 9 రోజులు నిరాహార దీక్ష చేస్తే కనీసం ఒక్క లోకల్ టీడీపీ నేత కూడా సంఘీభావం తెలపడానికి రాలేదు. ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయినా కూడా సిగ్గుతో తలదించుకొని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జగ్గంపేట నియోజకవర్గం జనసైనికులం అందరం ఇక్కడికి వస్తే ఇక్కడ మమ్మల్ని అవమానించి మీకు సీటు ఇచ్చినా కూడా మేము చేయం అని చెప్పి వాళ్లు బహిరంగంగా చెప్పడం జరిగింది. మేము కూడా వెనుదిరిగి బయటికి రావడం జరిగింది. ఈ విషయాలను జిల్లా అధ్యక్షుడి ద్వారా పవన్ కళ్యాణ్ కు చేరవేస్తాం. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆయనకే వదిలేస్తాం. ఒక్కటే చెబుతున్నాం.. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న జనసైనికులను తుదిముట్టించడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. పార్టీ ఎలా మమ్మల్ని కాపాడుకుంటుందో మేము కూడా ఎదురు చూస్తున్నాం అని పవన్ కళ్యాణ్ కు చెప్పారు సూర్యచంద్ర.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.