
pawan Kalyan comments on Ys Bharathi
Pawan Kalyan : రెండో దశ వారాహి విజయ యాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్ భార్య భారతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ రాజకీయాలలో ప్రత్యర్థుల భాగస్వామ్యల ప్రస్తావన తీసుకొచ్చిన సందర్భాలు లేవని స్పష్టం చేశారు. ఆడవాళ్లంటే తనకు అమితమైన గౌరవం అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ గారి భార్య వైయస్ భారతికి నాదొక విన్నపం. ఆ సంస్కారహీనుడికి వ్యక్తిగత జీవితాలు గురించి మాట్లాడే హక్కు లేదని మీరైనా చెప్పండి. మీరు ఇద్దరు ఆడపిల్లలు కలిగిన తల్లి. మీ గురించి నేను ఎప్పుడైనా మాట్లాడిన సందర్భాలు లేవు.
ఎందుకంటే మీరు ప్రజా జీవితంలో లేనివారు. మీ భర్తని నోరు అదుపులో పెట్టుకొని ఉండమని చెప్పండమ్మా. నేను చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను. అలాగే మీ సోషల్ మీడియాని కూడా.. పనిచేసుకునే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా చేయొద్దని చెప్పండమ్మా. మీరు కూడా ఆడవాళ్లే కదమ్మా.. మీకు ఆడపిల్లలు ఉన్నారు. అలా అనటం తప్పు.. దయచేసి ఆ సంస్కారహీనుడికి చెప్పండమ్మా అంటూ సీఎం జగన్ ఉద్దేశించి పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సభలో సొంత చెల్లి మరియు తల్లి పట్ల కూడా గౌరవం లేని ఈ వ్యక్తి.. రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలను ఎలా గౌరవిస్తాడు అంటూ జగన్ పై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
pawan Kalyan comments on Ys Bharathi
చిన్నాన్న కూతురు డాక్టర్ సునీతకి.. న్యాయం చేయలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర మహిళల పట్ల ఎలా గౌరవంగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఆ సంస్కారహీనుడికి పెళ్ళాలు అనే మాటలు వస్తున్నాయి అంటూ పవన్ తాడేపల్లిగూడెం వారాహి విజయ యాత్రలో తన కుటుంబ సభ్యుల పట్ల వైసిపి వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.