Pawan Kalyan : యోగి ఆదిత్యనాథ్ పేరు మీరు వినే ఉంటారు. ఆయన రెండు సార్లు యూపీలో బీజేపీని గెలిపించి సీఎం అయ్యారు. రేపటి రోజు ఆయన ప్రధాని అయిన ఆశ్చర్యం లేదు. యోగి వీర హిందూత్వకు 2024 లోక్ సభ ఎన్నికల్లో పెద్దగా సీట్లు రాబట్టలేకపోయింది. బీజేపీకి యూపీలో వచ్చిన ఓట్ల విషయంలో తేడా లేదు కానీ ఎస్పీ కాంగ్రెస్ కాంబో మాత్రం బీజేపీని దెబ్బ కొట్టింది. అయితే యూపీకి యోగీ కంటే వేరే బలమైన నేత లేరని ఈ రోజుకీ ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు సౌతిండియాలో మరో యోగి బీజేపీకి మిత్రుడిగా మారారా అన్న చర్చ సాగుతుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ వైట్ డ్రెస్, అది కూడా ఖద్దరు వస్త్రాలే ధరిస్తారు. సినిమా షూటింగ్స్‌లో ఎలా, రియల్ లైఫ్‌లో ఆయన నేతన్నల సంక్షేమం కోసం ఖద్దరు మాత్రమే వాడాలని డిసైడ్ అయ్యారు.
అది అలా ఉంచితే.. తాజాగా ఆయన.. కాషాయ వస్త్రాల్లో కనిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని గుర్తుచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఎనలేని అపచారం జరిగింది అని భావిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో దుర్గమ్మ ఆలయం మెట్లు కూడా శుభ్రం చేశారు. అంతేకాదు సనాతన ధర్మం గురించి బీజేపీ వారి కంటే పెద్ద గొంతుకతో మాట్లాడుతున్నారు. కాషాయ వస్త్రాలతో దీక్షా దక్షునిగా జనంలోకి వస్తున్నారు. హిందూ మతం మీద జరుగుతున్న దాడులకు హిందువులు అంతా ఏకీకృతం అయి ఉద్యమించాలని పవన్ పిలుపు ఇస్తున్నారు. బీజేపీకి సౌత్ లో ఎక్కడ ఈ స్థాయిలో గ్లామర్ కలిగిన నేత లేరు. పవన్ కి ఉన్న చరిష్మా ఆయనకు ఉన్న దూకుడుని హిందూత్వతో మిక్స్ చేస్తే తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియాలోనే రాజకీయ పంట పండించవచ్చు అని కొత్త ఆశలు కలుగుతున్నాయని అంటున్నారు.
ఏపీలో బలమైన రాజకీయ భూమిక పోషించడానికి బీజేపీ జనసేన కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇపుడు పవన్ హిందూత్వ నినాదం కూడా రేపటి రోజున ఇద్దరు మిత్రులకు పనికి వచ్చేదిగా ఉంటుందని అంటున్నారు. అలా పవన్ రూపంలో దక్షిణాదిన మరో యోగి దొరికారు అని కమలం పార్టీతో పాటు ఆరెస్సెస్ కూడా సంతోషించే సందర్భం ఇదే అని అంటున్నారు.ఏపీలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ ఇంకా చెప్పాలీ అంటే సౌత్ లో కానీ హిందూత్వకు ఉన్న మద్దతు ఎంత ఆదరణ ఎంత అనేది కూడా చూడాల్సి ఉంది.
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
This website uses cookies.