Pawan Kalyan : యూపీలో యోగి.. ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏంటి ఈ ప్లాన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan : యూపీలో యోగి.. ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏంటి ఈ ప్లాన్

Pawan Kalyan : యోగి ఆదిత్య‌నాథ్ పేరు మీరు వినే ఉంటారు. ఆయ‌న రెండు సార్లు యూపీలో బీజేపీని గెలిపించి సీఎం అయ్యారు. రేపటి రోజు ఆయ‌న ప్ర‌ధాని అయిన ఆశ్చ‌ర్యం లేదు. యోగి వీర హిందూత్వకు 2024 లోక్ సభ ఎన్నికల్లో పెద్దగా సీట్లు రాబ‌ట్ట‌లేక‌పోయింది. బీజేపీకి యూపీలో వచ్చిన ఓట్ల విషయంలో తేడా లేదు కానీ ఎస్పీ కాంగ్రెస్ కాంబో మాత్రం బీజేపీని దెబ్బ కొట్టింది. అయితే యూపీకి యోగీ కంటే వేరే బలమైన […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 September 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan : యూపీలో యోగి.. ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏంటి ఈ ప్లాన్

Pawan Kalyan : యోగి ఆదిత్య‌నాథ్ పేరు మీరు వినే ఉంటారు. ఆయ‌న రెండు సార్లు యూపీలో బీజేపీని గెలిపించి సీఎం అయ్యారు. రేపటి రోజు ఆయ‌న ప్ర‌ధాని అయిన ఆశ్చ‌ర్యం లేదు. యోగి వీర హిందూత్వకు 2024 లోక్ సభ ఎన్నికల్లో పెద్దగా సీట్లు రాబ‌ట్ట‌లేక‌పోయింది. బీజేపీకి యూపీలో వచ్చిన ఓట్ల విషయంలో తేడా లేదు కానీ ఎస్పీ కాంగ్రెస్ కాంబో మాత్రం బీజేపీని దెబ్బ కొట్టింది. అయితే యూపీకి యోగీ కంటే వేరే బలమైన నేత లేరని ఈ రోజుకీ ఆ పార్టీ భావిస్తోంది. మ‌రోవైపు సౌతిండియాలో మ‌రో యోగి బీజేపీకి మిత్రుడిగా మారారా అన్న చ‌ర్చ సాగుతుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ వైట్ డ్రెస్, అది కూడా ఖద్దరు వస్త్రాలే ధరిస్తారు. సినిమా షూటింగ్స్‌లో ఎలా, రియల్ లైఫ్‌లో ఆయన నేతన్నల సంక్షేమం కోసం ఖద్దరు మాత్రమే వాడాలని డిసైడ్ అయ్యారు.

Pawan Kalyan సౌతిండియా యోగి..

అది అలా ఉంచితే.. తాజాగా ఆయన.. కాషాయ వస్త్రాల్లో కనిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని గుర్తుచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఎనలేని అపచారం జరిగింది అని భావిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ క్ర‌మంలో దుర్గ‌మ్మ ఆల‌యం మెట్లు కూడా శుభ్రం చేశారు. అంతేకాదు సనాతన ధర్మం గురించి బీజేపీ వారి కంటే పెద్ద గొంతుకతో మాట్లాడుతున్నారు. కాషాయ వస్త్రాలతో దీక్షా దక్షునిగా జనంలోకి వస్తున్నారు. హిందూ మతం మీద జరుగుతున్న దాడులకు హిందువులు అంతా ఏకీకృతం అయి ఉద్యమించాలని పవన్ పిలుపు ఇస్తున్నారు. బీజేపీకి సౌత్ లో ఎక్కడ ఈ స్థాయిలో గ్లామర్ కలిగిన నేత లేరు. పవన్ కి ఉన్న చరిష్మా ఆయనకు ఉన్న దూకుడుని హిందూత్వతో మిక్స్ చేస్తే తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియాలోనే రాజకీయ పంట పండించవచ్చు అని కొత్త ఆశలు కలుగుతున్నాయని అంటున్నారు.

Pawan Kalyan యూపీలో యోగి ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఏంటి ఈ ప్లాన్

Pawan Kalyan : యూపీలో యోగి.. ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏంటి ఈ ప్లాన్

ఏపీలో బలమైన రాజకీయ భూమిక పోషించడానికి బీజేపీ జనసేన కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇపుడు పవన్ హిందూత్వ నినాదం కూడా రేపటి రోజున ఇద్దరు మిత్రులకు పనికి వచ్చేదిగా ఉంటుందని అంటున్నారు. అలా పవన్ రూపంలో దక్షిణాదిన మరో యోగి దొరికారు అని కమలం పార్టీతో పాటు ఆరెస్సెస్ కూడా సంతోషించే సందర్భం ఇదే అని అంటున్నారు.ఏపీలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ ఇంకా చెప్పాలీ అంటే సౌత్ లో కానీ హిందూత్వకు ఉన్న మద్దతు ఎంత ఆదరణ ఎంత అనేది కూడా చూడాల్సి ఉంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది