Pawan Kalyan : పిఠాపురంలో మారుతున్న సీన్స్.. ప‌వ‌న్‌పై బెట్టింగులు త‌గ్గుతున్నాయేంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : పిఠాపురంలో మారుతున్న సీన్స్.. ప‌వ‌న్‌పై బెట్టింగులు త‌గ్గుతున్నాయేంటి?

 Authored By ramu | The Telugu News | Updated on :23 May 2024,4:00 pm

Pawan Kalyan : పిఠాపురం ఈ సారి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన నియోజ‌క‌వ‌ర్గం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ నియెజ‌క వ‌ర్గంలో పోటీ చేస్తుండ‌డంతో అంద‌రి దృష్టి దానిపైనే ప‌డింది. ఈ సారి ప‌వ‌న్ గెలుస్తాడా లేదా అనే దానిపై జోరుగా చర్చ న‌డుస్తుంది. పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆ నియోజకవర్గ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. తన పార్టీ నాయకులతో పాటు పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతుతో స్థానిక ప్రజలతో చురుగ్గా మమేకమై వారి ఆదరణ పొందుతున్నారు. ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడనప్పటికీ, జనసేన నాయకులు ఇప్పటికే పనిలో ఉన్నారు.

Pawan Kalyan గ‌ట్టి ఫైట్..

నియోజకవర్గంలో ప్రజలకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వన్నెపూడి జంక్షన్‌లో జరిగిన ప్రమాదంలో స్థానిక జనసేన నాయకుడు చెప్పుల నాని మరణించారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జేఎస్పీ నేతలు సోమవారం నాని కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. గ‌త ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్..ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగారు.ఈసారి ఎలాగైనా గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టడానికి పవన్ కల్యాణ్ చేయని ప్రయత్నం లేదు. దాదాపు తొంబై వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకర్గంలో ఉండటంతో పవన్ అక్కడ నుంచి పోటీ నుంచి పోటీ చూశారు. పోలింగ్ సరళని చూసిన తర్వాత పవన్ కల్యాణ్‌కు మెజార్టీ ఎంత అనే దానిపైనే చర్చ సాగుతోంది. అయితే పిఠాపురంలో ఆయన గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Pawan Kalyan పిఠాపురంలో మారుతున్న సీన్స్ ప‌వ‌న్‌పై బెట్టింగులు త‌గ్గుతున్నాయేంటి

Pawan Kalyan : పిఠాపురంలో మారుతున్న సీన్స్.. ప‌వ‌న్‌పై బెట్టింగులు త‌గ్గుతున్నాయేంటి?

పోలింగ్ తర్వాత రెండు రోజులు లక్ష మెజార్టీ అన్న జనసేన , టీడీపీ నేతలు..ఇప్పుడు 10 నుంచి 20 వేలు మెజార్టీ వస్తుందని చెప్పడం సంచలనంగా మారింది. బూత్‌ల వారిగా ఓట్ల లేక్కలు చూసిన తర్వాత పవన్ గెలిస్తే చాలు అనే అభిప్రాయానికి నేతలు వచ్చినట్టు తెలుస్తుంది.పిఠాపురంలో మొత్తం తొంబై వేల దాకా కాపులు ఉంటే యూత్ ఓట్లు అన్నీ దాదాపుగా పవన్‌కే పడినట్లు తెలుస్తోంది. ఇక మధ్య వయస్సు , మహిళల ఓట్లు మాత్రం కచ్చితంగా వంగా గీతకే మద్దతు నిలిచినట్టు తెలుస్తోంది.నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 32 వేల ఓట్లలో లక్షా ఎనభై వేలు ఓట్లు ఉండగా,కచ్చితంగా లక్షపైన ఓట్లు గీతకు వస్తాయని వైసీపీ బల్ల గుద్ది చెబుతోంది. పైకి జ‌న‌సేన పేరు చెబుతున్నా గ్రౌండ్ లెవ‌ల్ వేరేలా ఉంద‌ని అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది