PM Kisan : రైతు సోదరులను దృష్టిలో ఉంచుకుని గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం అనేక రకాల రైతు పథకాలను అమలు చేస్తూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాల ద్వారా రైతులు అనేక రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు మేలు కలిగించే పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కూడా ఒకటి. అయితే ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయపడుతూ వస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాలకు 17 విడతల డబ్బు బదిలీ చేయగా , ఇక ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రావాల్సిన 18వ విడత డబ్బు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. మరి రైతుల ఖాతాలోకి 18వ విడత డబ్బు ఎప్పుడు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే కేంద్ర ప్రభుత్వం జూన్ 18 నాటికి దాదాపు 9 కోట్ల మంది రైతులకు 17వ విడత నిధులను అందించినట్లుగా తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతు సోదరులకు డబ్బు సక్రమంగా అందజేశామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అయితే డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ నెలలో 18వ విడత డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కావున 18వ విడత డబ్బు కోసం ఎదురుచూస్తున్న రైతులందరికీ ఇది ఒక శుభవార్త అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అంతేకాక ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ పథకం ద్వారా రైతులకు అందాల్సిన మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.8 వేల కు పెంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి రైతు సోదరులకు ఇది ఆర్థిక సహాయంగా అందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈసారి అక్టోబర్ నెలలో కచ్చితంగా 18వ విడత డబ్బులు నేరుగా రైతు ఖాతాల్లోకి చేరుతాయని తెలుస్తుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.