PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజన 18వ విడత ఎప్పుడంటే…!

 Authored By ramu | The Telugu News | Updated on :16 July 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజన 18వ విడత ఎప్పుడంటే...!

PM Kisan : రైతు సోదరులను దృష్టిలో ఉంచుకుని గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం అనేక రకాల రైతు పథకాలను అమలు చేస్తూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాల ద్వారా రైతులు అనేక రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు మేలు కలిగించే పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కూడా ఒకటి. అయితే ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయపడుతూ వస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాలకు 17 విడతల డబ్బు బదిలీ చేయగా , ఇక ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రావాల్సిన 18వ విడత డబ్బు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. మరి రైతుల ఖాతాలోకి 18వ విడత డబ్బు ఎప్పుడు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

PM Kisan 18వ విడత ఎప్పుడంటే…

అయితే కేంద్ర ప్రభుత్వం జూన్ 18 నాటికి దాదాపు 9 కోట్ల మంది రైతులకు 17వ విడత నిధులను అందించినట్లుగా తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతు సోదరులకు డబ్బు సక్రమంగా అందజేశామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అయితే డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ నెలలో 18వ విడత డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కావున 18వ విడత డబ్బు కోసం ఎదురుచూస్తున్న రైతులందరికీ ఇది ఒక శుభవార్త అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజన 18వ విడత ఎప్పుడంటే...!

PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజన 18వ విడత ఎప్పుడంటే…!

అంతేకాక ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ పథకం ద్వారా రైతులకు అందాల్సిన మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.8 వేల కు పెంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి రైతు సోదరులకు ఇది ఆర్థిక సహాయంగా అందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈసారి అక్టోబర్ నెలలో కచ్చితంగా 18వ విడత డబ్బులు నేరుగా రైతు ఖాతాల్లోకి చేరుతాయని తెలుస్తుంది.

Tags :

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి