Power Star Liquor : ప‌వర్ స్టార్ బ్రాండ్ ర‌చ్చ‌.. ఆ మందు విష‌యంలో వైసీపీ, కూట‌మి మధ్య వార్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Power Star Liquor : ప‌వర్ స్టార్ బ్రాండ్ ర‌చ్చ‌.. ఆ మందు విష‌యంలో వైసీపీ, కూట‌మి మధ్య వార్..!

Power Star Liquor : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌నుల్లో వేగం పెరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు వ‌డివ‌డిగా ప‌నుల‌ని చ‌క్క‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు స్వ‌యంగా పించ‌నుదారుడి ఇంటికి వెళ్లి మరీ ఫించ‌ను అందించ‌డం మ‌నం చూశాం. ఇక ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ… అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. ఒక‌రి త‌ప్పుల‌ని ఒకరు ఎత్తి చూపించుకుంటూ పెద్ద ర‌చ్చ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏపీలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2024,4:00 pm

Power Star Liquor : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌నుల్లో వేగం పెరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు వ‌డివ‌డిగా ప‌నుల‌ని చ‌క్క‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు స్వ‌యంగా పించ‌నుదారుడి ఇంటికి వెళ్లి మరీ ఫించ‌ను అందించ‌డం మ‌నం చూశాం. ఇక ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ… అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. ఒక‌రి త‌ప్పుల‌ని ఒకరు ఎత్తి చూపించుకుంటూ పెద్ద ర‌చ్చ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏపీలో మద్యం బ్రాండ్లపై రగడ మొదలైంది. కూటమి ప్రభుత్వం కొత్తగా పవర్ స్టార్ విస్కీ బ్రాండ్ తెచ్చిందని ఓ పోస్టు పెట్టింది. దీనిపై టీడీపీ, జనసేన పార్టీలు గట్టి కౌంటర్ ఇచ్చాయి.

Power Star Liquor మ‌ద్యం ర‌చ్చ‌..

పవర్ స్టార్ విస్కీ.. కూటమి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్ అంటూ వైసీపీ విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టింది. నాణ్యమైన మద్యం అంటూ జనసైనికుల్ని మెప్పించేలా పవర్ స్టార్ పేరుతో విస్కీని చంద్రబాబు సర్కార్ తెరపైకి తెచ్చిందని వైసీపీ షేర్ చేస్తూ… ఏపీలో మాత్రమే ఈ బ్రాండ్ అందుబాటులోకి ఉంటుందని, నాణ్యమైన మద్యం అంటే ఇదేనా బాబూ అంటూ సెటైర్లు వేసింది. అయితే… ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వచ్చిన బ్రాండ్ అని అంటున్నారు. ఈ మేరకు నాడు ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా… మద్యపాన నిషేదం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్… ఇప్పుడు తన పేరు మీద కూడా లిక్కర్ తెచ్చారని పవన్ ఫైరయ్యారు.

Power Star Liquor ప‌వర్ స్టార్ బ్రాండ్ ర‌చ్చ‌ ఆ మందు విష‌యంలో వైసీపీ కూట‌మి మధ్య వార్

Power Star Liquor : ప‌వర్ స్టార్ బ్రాండ్ ర‌చ్చ‌.. ఆ మందు విష‌యంలో వైసీపీ, కూట‌మి మధ్య వార్..!

జగన్ పాపాలు చేయడంలో శిశుపాలుడికి గాడ్ ఫాదర్ అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. తానే విషపు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయి ఉండి ఇతరులపై విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ విమర్శించింది. ఐదేళ్లలో ప్రమాదకర మద్యంతో లక్షలాది జనం ప్రాణాలు తీశారని ఆరోపించింది. ప్రపంచంలో ఎక్కడా దొరకని డేంజరస్ లిక్కర్ త్రీ క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, బూమ్ బూమ్, 99 పవర్ స్టార్ ఇవన్నీ జగన్ దోపిడీ కోసం తెచ్చిన బ్రాండ్లు అని కౌంటర్ ఇచ్చింది. వైసీపీకి అల్జీమర్స్ వ్యాధి సోకితే అది మా తప్పా? ఆ బ్రాండ్ తెచ్చింది మీరే అని మర్చిపోయారా? అంటూ జనసేన కూడా ట్వీట్ చేసింది.ఈ క్ర‌మంలో వైసీపీకి గ‌ట్టి కౌంట‌రే ఇచ్చింది. ప్ర‌స్తుతం కూట‌మి,వైసీపీ మ‌ధ్య వార్ మ‌ద్యం విష‌యంలో ఓ రేంజ్‌లో న‌డుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది