Shyamala Devi : పవన్ కోసం ప్రచారాలు చేస్తున్న ప్రభాస్ తల్లి శ్యామలాదేవి...!
Shyamala Devi : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాలను హోరాహోరీగా కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు మరో నాలుగు రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే సమయం వృధా చేయకుండా రాజకీయ నేతలు వారి పార్టీల తరఫున పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఈ చివరి నిమిషంలో ప్రజలను ఆకట్టుకుని ఓట్లు గెలిచేందుకు రాజకీయ పార్టీలు వస్తూ , ధన రూపేనా ఓటర్లకు కానుకలను అందిస్తూ ఓట్లు వారికే పడేలా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఇండస్ట్రీ నుంచి సినీ ప్రముఖులు కూడా ప్రచారాల్లో పాల్గొంటూ వారికి నచ్చిన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సినీ ప్రముఖుల ప్రచారాలు అనేవి ట్రెండింగ్ గా మారాయి. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురం నియోజకవర్గం లో జబర్దస్త్ ఆర్టిస్టులు , సినీ ప్రముఖులు ప్రచారాలు చేస్తూ పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. ఇక వైసీపీ తరఫున మొన్నటి వరకు యాంకర్ శ్యామల ఒక్కరే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి మద్దతు తెలిపారు.
ఇదిలా ఉండగా తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీ ఒకప్పటి స్టార్ హీరో కృష్ణంరాజు గారి భార్య ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూటమి తరుపున ప్రచారాలు చేపట్టటం ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలోనే శ్యామలాదేవి టీడీపీ కూటమికి మద్దతు తెలుపుతూ తాజాగా నర్సాపురంలోని కూటమి అభ్యర్థిగా నిలబడిన భూపతి రాజు శ్రీనివాస వర్మకి సపోర్ట్ ఇస్తూ నిలబడ్డారు. అయితే శ్రీనివాస్ వర్మ అనే వ్యక్తి బీజేపీలో చాలా సంవత్సరాలుగా కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి. ఈ నేపథ్యంలోనే కూటమిలో భాగంగా నరసాపురం టికెట్ ఈయనకు లభించింది. అయితే ఇదివరకే వైసీపీ పార్టీ ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవిని కలిసి నరసాపురం ఎంపీ టికెట్ ఆమెకు ఇస్తామని అక్కడి నుండి పోటీ చేయాల్సిందిగాా కోరారు. అయితే ఆమె దానికి ఒప్పుకోకపోగా వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు టీడీపీ కూటమికి మద్దతు తెలుపుతూ ప్రచారాలు చేపట్టారు .
Shyamala Devi : పవన్ కోసం ప్రచారాలు చేస్తున్న ప్రభాస్ తల్లి శ్యామలాదేవి…!
దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి బీజేపీ తరఫున నిలబడ్డారు అంటే ప్రభాస్ మద్దతు కూడా బీజేపీకేనా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే గత కొద్ది రోజులుగా బీజేపీ నేతలు ప్రభాస్ ను విపరీతంగా పొగిడేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక గత ఏడాది విడుదలైన ఆది పురుష్ కి బీజేపీ నుండి మంచి స్పందన లభించింది. అయితే పెద్దమ్మ శ్యామల దేవి మద్దతు బీజేపీకి ఉండటం వలనే సినిమాను బీజేపీ వాళ్లు అంతగా పొగుడుతున్నారా అని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి ప్రచారాల కోసం తిరగనప్పటికీ వీడియో రూపంలో తమ్ముడికి మద్దతు తెలుపుతూ వచ్చారు. చిరంజీవి మాదిరిగానే ప్రభాస్ కూడా ప్రచారాలలో పాల్గొనకుండా సోషల్ మీడియా ద్వారా బీజేపీ కి సపోర్ట్ ఇవ్వనున్నారా అంటూ పలువురు తెలియజేస్తున్నారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.