
PMAY : కేంద్ర ప్రభుత్వం అర్బన్ 2.0 స్కీమ్ కింద కోటి ఇండ్లకు గ్రీన్ సిగ్నల్... అర్హులు ఎవరు... ఎలా అప్లై చేయాలంటే...?
PMAY : దేశంలోని పేద ప్రజలు ఇల్లు కట్టుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకం కింద దాదాపు కోటి ఇల్లను మంజూరు చేసేందుకుగాను ఇటీవల క్యాబినెట్ కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ పథకానికి ఎవరు అర్హులు..?ఈ పథకం ద్వారా ఎలాంటి రాయితీలు లభిస్తాయి..?తదితర వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పట్టణాలలో నివసిస్తున్నటువంటి పేద మరియు మధ్యతరగతి ప్రజలకి కచ్చితంగా సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కల ఉంటుంది. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం సహేతుకమైన ధరలలో ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి మరియు పేద ప్రజల కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం దేశంలోని పట్టణాలలో నివసించే పేద మరియు మధ్య తరగతి వారు సొంతంగా ఇల్లు కట్టుకునే విధంగా వారికి గృహ సబ్సిడీ అందించడమే.
మురికివాడలో నివసించే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వితంతువు దివ్యాంగులు మరియు సమాజంలో వెనకబడిన మరియు అట్టడుగు వర్గాలు చెందినవారికి ఈ పథకం మేలును కలుగజేస్తుంది. అదేవిధంగా సఫాయి కార్మికులు, వీధి వ్యాపారులు చేతివృత్తుల వారు అంగన్వాడి వర్కర్స్ వంటి వారికి కూడా ఈ పథకం ప్రయోజనాలు అందిస్తుంది.
ఆర్థిక బలహీన వర్గాలు మరియు అల్పాదాయ వర్గాలు మధ్యస్థాయి ఆదాయ వర్గానికి చెందినవారు ఈ పథకానికిి అర్హులవుతారు. అయితే ఈ పథకంలో ప్రయోజనాలు పొందాలంటే కుటుంబం యొక్క ఆర్థిక ఆదాయం 0 నుండి 3లక్షల మధ్య ఉండాలి. అలాంటివారు ఆర్థిక బలహీన వర్గాలకు చెందిన వారు అవుతారు. అలాగే 3 లక్షల నుంచి 6 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు ఎల్ఐసి క్యాటగిరి కిందకి 6 నుంచి 9 లక్షల వరకు ఉన్నవారిని ఎంఐజి కేటగిరి కింద పరిగణించడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరీకి చెందినవారికి సొంత స్థలం ఉన్నట్లయితే వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తుంది. అలాగే భూమిలేని లబ్ధిదారులకు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట వారికి పట్టా భూమి అందించడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ లేదా ప్రైవేట్ ఏజెన్సీలు నిర్మించిన ఇల్లు కొనుగోలు చేయాలి అనుకునే ఈ డబ్ల్యూ ఎస్ వర్గానికి చెందినవారికి ఆర్దిక చేయూత అందించడంజరుగుతుంది.
PMAY : కేంద్ర ప్రభుత్వం అర్బన్ 2.0 స్కీమ్ కింద కోటి ఇండ్లకు గ్రీన్ సిగ్నల్… అర్హులు ఎవరు… ఎలా అప్లై చేయాలంటే…?
అదేవిధంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి మరియు అల్ప మధ్య స్థాయి వర్గాలకు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా హోమ్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ 35 లక్షల వరకు విలువ చేసే ప్రాపర్టీ కోసం మీరు బ్యాంకు నుండి 25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు . బ్యాంకు నుండి తీసుకున్న ఈ రుణాన్ని మీరు 12 ఏళ్లలోపు తీర్చాలి అని నిర్ణయించుకున్నట్లయితే మీ మొత్తం లోన్ అమౌంట్ 8 లక్షల రుణం పై 4% వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది.ఈ లెక్క ప్రకారం 5 సంవత్సరాల లోపు గరిష్టంగా రూ.1.80 లక్షల వరకు మీరు సబ్సిడీ పొందవచ్చు .
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.