Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో ఇప్పుడు పుష్ప2 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లుగా మూవీ టీమ్ ఎప్పుడో ప్రకటించింది. కానీ చాలా వరకూ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం, అలానే పోస్ట్ ప్రొడక్షన్ పనులకి ఉన్న టైమ్ సరిపోదని మూవీ టీమ్ భావిస్తుందట. ఎంత గట్టిగా పని చేసినా రెండు నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేయడం దాదాపు అసాధ్యమే. దీంతో అనుకున్న ప్రకారం సినిమా విడుదల కావడం లేదంటూ అల్లు అర్జున్ సన్నిహితుడైన శరత్ చంద్ర నాయుడు చెప్పారు.
మరో ప్రక్క పవన్ ఫ్యాన్స్ తో పుష్ప 2 కి ఓపెనింగ్స్ సమస్య వస్తుందని..వాళ్లు బాయికాట్ చేస్తారేమోనని మూవీని వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఆగస్ట్ 15 తేదీకి రిలీజ్ అని ఎగ్రిమెంట్ చేసుకుని బిజినెస్ డీల్స్ భారీ రేట్లకు నిర్మాతలు క్లోజ్ చేసారు. ముఖ్యంగా నార్త్ నుంచి భారీ అడ్వాన్స్ లు వచ్చాయి. అయితే వాయిదా పడడంతో మొత్తం ఎగ్రిమెంట్స్ రివైజ్ చేయాల్సి ఉంటుంది. వడ్డీకు తెచ్చిన డబ్బుతో సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ గోలెత్తిపోతున్నారట. ఇప్పుడు ఆ వడ్డీ నష్టాన్ని నిర్మాతలే చెల్లించాల్సిన పరిస్దితి. దాంతో ఇప్పుడు అనుకున్న రేట్లకు తగ్గించి సినిమా ఇస్తున్నట్లు రీ ఎగ్రిమెంట్ చేసుకోవాలి. అలాగే ఆగస్ట్ 15 లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కూడా మిస్సవుతోంది. దాంతో తమకు కలక్షన్స్ దెబ్బ పడుతుందని అంటున్నారట.
సినిమా బడ్జెట్ దాదాపు 900 కోట్ల రూపాయలు దాటిందని, ఇక ఆగస్ట్ 15న మూవీ వాయిదా పడడంతో నిర్మాతలు 60 కోట్ల రూపాయలు వడ్డీ కట్టుకోవల్సి వచ్చిందట. ఇది విన్న అభిమానులు వాటితో చిన్న సినిమానే తీయోచ్చుగా అని అంటున్నారు. ఇక డిసెంబర్ 6న విడుదల చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుండగా, అది కూడా కష్టమే అనే టాక్ వినిపిస్తుంది. సుకుమార్, బన్నీ మధ్య విభేదాలు తలెత్తాయని అనుకున్నంతగా ఔట్‌పుట్ రావడం లేదనే టాక్ కూడా ఉంది. ఏదేమైన పుష్ప2ఈ సారి భారీ దెబ్బ కొట్టేలా ఉంది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.