Categories: Newspolitics

Prashant Kishore : మ‌రోసారి జ‌గ‌న్‌తో క‌లిసి ప‌నిచేయ‌నున్న ప్ర‌శాంత్ కిషోర్ !

Prashant Kishore : ప్రశాంత్ కిషోర్.. భారతీయ ఎన్నికలలో మిడాస్ టచ్ ఉన్న వ్యక్తి. అతను ప‌ని చేసిన దాదాపు ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వ‌చ్చేలా చేశాడు. వైఎస్‌ఆర్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను 2019లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి తీసుకురావడంలో క్రీయాశీల‌క పాత్ర పోషించారు. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను 22 స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు గాను 150 స్థానాలకు పైగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది.అయితే 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓట‌మి పాలైంది. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ, ప్రజలతో దూరం పెరగడ‌ జగన్ ఓటమికి ఒక కారణంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్ పార్టీ నేతలతో వ‌రుస‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశాల్లోనూ పాల్గొంటున్నారు. దాంతో ఏపీలో రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారుతున్న‌ది.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మ‌ళ్లీ వైసీపీకి ప‌నిచేసే అంశం మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చగా మారుతున్న‌ది. 2019 ఎన్నికల ముందు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు, సొంత రాష్ట్రంలో సొంత పార్టీ ఏర్పాటుతో జగన్ కు దూరం జ‌రిగారు. అయితే ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేసిన రిషిరాజ్ సింగ్ వైసీపీ కోసం తాజా ఎన్నికల వరకు తన టీంతో పని చేశారు. మ‌రోవైపు ప్రశాంత్ కిషోర్ ఒక‌ప్ప‌టి సహచరుడు రాబిన్ శర్మ, శంతన్ టీడీపీకి పని చేశారు.

ఇదేక్ర‌మంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ప్రశాంత్ కిషోర్ అమరావతికి వచ్చి సమావేశం అయ్యారు. హైదరాబాద్ కేంద్రంగానూ ఇరువురి మ‌ధ్య భేటీలు జ‌రిగాయి. జగన్ కు వ్యతిరేకంగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోతారని చెప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్, మద్యం గురించి కూటమి ప్రచారం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే వాదన ఉంది.

Prashant Kishore : మ‌రోసారి జ‌గ‌న్‌తో క‌లిసి ప‌నిచేయ‌నున్న ప్ర‌శాంత్ కిషోర్ !

జగన్ కు సన్నిహితంగా ఉండే ఒక జాతీయ నేత సూచనతో తిరిగి ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ కోసం పని చేయాలని కోరిన‌ట్లుగా స‌మాచారం. అయితే ఈ ప్రతిపాదన జగన్ వద్ద రాగా అందుకు జగన్ సుముఖంగా లేరని పార్టీ నాయ‌కులు పేర్కొంటున్నారు. జగన్ ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ నేరుగా చూస్తున్నారు. దీనిపై వైసీపీ నేత‌లు గానీ లేదా ప్రశాంత్ కిషోర్ గానీ స్పందిస్తే స్పష్టత వ‌చ్చే అవ‌కాశం.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

2 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

3 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

4 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

6 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

7 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

8 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

9 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

10 hours ago