Prashant Kishore : మరోసారి జగన్‌తో కలిసి పనిచేయనున్న ప్రశాంత్ కిషోర్ !
ప్రధానాంశాలు:
Prashant Kishore : మరోసారి జగన్‌తో కలిసి పనిచేయనున్న ప్రశాంత్ కిషోర్ !
Prashant Kishore : ప్రశాంత్ కిషోర్.. భారతీయ ఎన్నికలలో మిడాస్ టచ్ ఉన్న వ్యక్తి. అతను పని చేసిన దాదాపు ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేశాడు. వైఎస్‌ఆర్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను 2019లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి తీసుకురావడంలో క్రీయాశీలక పాత్ర పోషించారు. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను 22 స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు గాను 150 స్థానాలకు పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.అయితే 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ, ప్రజలతో దూరం పెరగడ జగన్ ఓటమికి ఒక కారణంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశాల్లోనూ పాల్గొంటున్నారు. దాంతో ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతున్నది.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ వైసీపీకి పనిచేసే అంశం మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చగా మారుతున్నది. 2019 ఎన్నికల ముందు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు, సొంత రాష్ట్రంలో సొంత పార్టీ ఏర్పాటుతో జగన్ కు దూరం జరిగారు. అయితే ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేసిన రిషిరాజ్ సింగ్ వైసీపీ కోసం తాజా ఎన్నికల వరకు తన టీంతో పని చేశారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ ఒకప్పటి సహచరుడు రాబిన్ శర్మ, శంతన్ టీడీపీకి పని చేశారు.
ఇదేక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ప్రశాంత్ కిషోర్ అమరావతికి వచ్చి సమావేశం అయ్యారు. హైదరాబాద్ కేంద్రంగానూ ఇరువురి మధ్య భేటీలు జరిగాయి. జగన్ కు వ్యతిరేకంగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోతారని చెప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్, మద్యం గురించి కూటమి ప్రచారం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే వాదన ఉంది.
జగన్ కు సన్నిహితంగా ఉండే ఒక జాతీయ నేత సూచనతో తిరిగి ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ కోసం పని చేయాలని కోరినట్లుగా సమాచారం. అయితే ఈ ప్రతిపాదన జగన్ వద్ద రాగా అందుకు జగన్ సుముఖంగా లేరని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. జగన్ ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ నేరుగా చూస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు గానీ లేదా ప్రశాంత్ కిషోర్ గానీ స్పందిస్తే స్పష్టత వచ్చే అవకాశం.