ఆయన చంద్రబాబు సమకాలీనుడు. ఇద్దరూ కలసి 1978లో ఒకేసారి చట్ట సభలలో అడుగు పెట్టారు. నాటి నుంచి సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పూసపాటి సంస్థానాధీశుడిగా, తిరుగులేని రాజకీయ నేతగా కు తెలుగు రాష్ట్రాలలో బాగా పేరుంది. టీడీపీ ఆవిర్భావంలో ఎన్టీయార్ వెంట ఉన్న అశోక్ గజపతిరాజు పెద్దాయనకు వెన్నుపోటు పొడిచే ఘట్టాన బాబుకు బాసటగా నిలిచి ఆ తరువాత టీడీపీలో కీలకం అయ్యారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అశోక్ గజపతిరాజు ఈ మధ్య కాలంలో మాత్రం చంద్రబాబుతోనే కాస్త ఎడం పాటిస్తున్నారు. చంద్రబాబునాయుడు గత రెండున్నరేళ్ళలో అనేక సార్లు పొలిట్ బ్యూరో సమావేశాలు, పార్టీ మీటింగ్స్ నిర్వహించారు.
అయితే వాటికి వరసగా డుమ్మా కొట్టిన అశోక్ గజపతిరాజు తాజాగా విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదికలో మెరిసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మరి బాబు మాటనే అంతగా పట్టించుకోని అశోక్ గజపతిరాజు ఇతర నాయకులతో భుజం భుజం కలిపి మీటింగులో కూర్చోవడం అంటే ఆసక్తికరమే. పైగా రాజా వారు అంటే ఆ లెవెల్ వేరు అంటారు. మరి అన్ని మెట్లూ దిగి తమ్ముళ్లతో చెట్టాపట్టాలు వేయడం వెనక వ్యూహం ఏమిటన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది.
విజయనగరంలో ఇప్పటిదాకా అశోక్ గజపతిరాజు కేవలం అశోక్ బంగ్లానే టీడీపీ ఆఫీస్ చేసి తానే పార్టీకి పెద్ద దిక్కు అన్నట్లుగా కధ నడిపించారు. చివరికి అశోక్ బంగ్లాను దాటి టీడీపీ ఆఫీస్ వేరు పడిపోయింది. అలా చూస్తూండగానే క్యాడర్ కూడా చెల్లాచెదురు అయింది. మరో వైపు వైసీపీ కాస్తా గట్టిగానే రాజా వారిని టార్గెట్ చేసింది. అటు రికార్డులు మాయమైన వందలాది సింహాచలం భూముల కేసు మీద నిశితంగా దర్యాప్తు జరుగుతోంది. మరో వైపు చూసుకుంటే మాన్సాస్ ట్రస్ట్ కి చెందిన వందలాది ఎకరాలు కూడా మాయం అయ్యాయి.
ఇక ఏకంగా అశోక్ గజపతిరాజు చైర్మన్ గిరీనే ఒక తడవ లాగేసిన వైసీపీ సర్కార్ ఇపుడు చాన్స్ కోసం ఎదురుచూస్తోంది. దాంతో అటు సంస్థానం, ఇటు రాజకీయం రెండూ కూడా కుదేల్ అయ్యే సీన్ కళ్ల ముందే కనిపిస్తోంది. దాంతోనే రాజకీయ తెలివితో అశోక్ గజపతిరాజు తమ్ముళ్ల జట్టుకు వచ్చేశారని టాక్ వినిపిస్తోంది. అశోక్ గజపతిరాజు అంటే ఊకదంపుడు మాట్లాడరు అంటారు, గాలి కబుర్లు చిల్లర ఆరోపణలు అసలు చేయరని కూడా పేరు. కానీ కాలం ఆయనలో మార్పు తెచ్చింది. అందుకే ఆయన వైసీపీ మీద ఎన్నడూ లేనంతగా గట్టిగానే విమర్శలు చేస్తున్నారు.
వీఎమ్మార్డీయే మాస్టర్ ప్లాన్ మీద అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ప్లాన్ 2042 అంటున్నారు వైసీపీ పెద్దలు. అప్పటికి వీరే కనుక పాలిస్తే కచ్చితంగా ఈ ప్రాంతంలో మనుషులు మాత్రం జీవించి ఉండరు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాదు దొంగే దొంగని అంటున్నట్లుగా సింహాచలం భూములు వైసీపీ వారే దిగమింగి మాపై ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం చెందారు.
జైల్ నుంచి వచ్చిన వారు బెయిల్ మీద ఉన్న వారు రాష్ట్రాన్ని ఏలుతున్నారు అంటూ మంచి టైమింగ్ తో అశోక్ గజపతిరాజు చేసిన కామెంట్స్ కూడా వైసీపీని మండించేవే. ఈ సర్కార్ కి మంచి బుద్ధి ప్రసాదించాలి అని పైడితల్లమ్మతో పాటు సింహాద్రి నాధుడిని కూడా కోరుకుంటున్నాను అంటూ అశోక్ గజపతిరాజు సెటైరికల్ గా అనడం అంటే ఆయన కూడా చూస్కో నా రాజా అని వైసీపీకి ఇక మీదట చాలెంజెస్ చేస్తారన్న మాట.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి టీడీపీ జోష్ పెరగడమేనని కేడర్ తెగ చర్చించుకుంటోంది. అయితే ఈ దూకుడు ఎంతవరకు అన్నది మాత్రం అశోక్ గజపతిరాజు మాత్రమే చెప్పగలరు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.