Khammam MP Ticket : పొంగులేటి పంతం నెగ్గింది.. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టినేట్టేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Khammam MP Ticket : పొంగులేటి పంతం నెగ్గింది.. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టినేట్టేనా?

 Authored By ramu | The Telugu News | Updated on :23 April 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Khammam MP Ticket : పొంగులేటి పంతం నెగ్గింది.. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టినేట్టేనా?

Khammam MP Ticket : ఖ‌మ్మం ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్ర‌కంప‌న‌లు సృష్టించిందో మ‌నం చూశాం. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డికి ఖ‌మ్మం ఎంపీ టికెట్ అధిష్టానం కేటాయించ‌డంతో చిచ్చు రేగింది. పొంగులేటి కుటుంబసభ్యులకు టికెట్‌ రాకుండా అడ్డుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు ప్ర‌చారాలు సాగాయి. అయితే పొంగులేటి వియ్యంకుడికి టికెట్‌ ఇవ్వడం రాష్ట్ర పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డి ఏకఛత్రాధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు గాను అదిష్టానం ఆ నిర్ణ‌యం తీసుకుందంటూ కాంగ్రెస్ వ‌ర్గాల‌లో ప్ర‌చారం జ‌రిగింది. అయితే పొంగులేటిని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి కాగా,ఇప్పుడు ఆయ‌న‌కే చెక్ పెడుతున్నారా అన్న ప్ర‌శ్న మొద‌లైంది.

Khammam MP Ticket : పార్టీలో ఏం జ‌రుగుతుంది ?

పొంగులేటిని పార్టీలో హైలెట్‌ చేయడం రేవంత్ రెడ్డి చేసిన మొదటి త‌ప్పు అంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచే తన ‘భవిష్యత్తు’కు బాటలు వేసుకుంటున్నట్టుగా ప్ర‌చారాలు సాగాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో త‌న వారికి టిక్కెట్స్ ఇప్పించి గెలిపించుకున్నారు. లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో కూడా ఆయ‌న ప‌క్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. పార్టీలో విధేయుడిగా ఉంటూనే.. ఢిల్లీకి గురిపెట్టారనే అభిప్రాయాలున్నాయి. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం, ఢిల్లీస్థాయిలో తన పరిచయాలు, పార్టీ అధిష్ఠానం వద్ద తన లాబీయింగ్‌, ఆర్థిక బలం ఇలా అన్నింటిని ఉప‌యొగించి ఎంపీ టిక్కెట్ కోసం ఢిల్లీ స్థాయిలో ఆయ‌న చ‌క్రం తిప్పుతున్నాడ‌నే ప్ర‌చారం ఉంది.

Khammam MP Ticket పొంగులేటి పంతం నెగ్గింది రేవంత్ రెడ్డికి చెక్ పెట్టినేట్టేనా

Khammam MP Ticket : పొంగులేటి పంతం నెగ్గింది.. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టినేట్టేనా?

పొంగులేటి కుటుంబీకులకు టికెట్‌ వచ్చి ఢిల్లీకి వెళితే పెద్ద దెబ్బ త‌గిలిన‌ట్టే అవుతుందని రేవంత్, భ‌ట్టి భావించారు. అయితే పార్టీలో కీలక నేతలంతా వ్యతిరేకిస్తున్నా… పొంగులేటి తన వాళ్లకు టికెట్‌ ఇప్పించుకోగలిగారు. ఇలా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలైనా జరిగేందుకు ఆస్కారం ఉందనే చర్చ జరుగుతున్నది. భవిష్యత్తులో ఏం జరుగుతుందోననే అనుమానాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.ఇక అటు అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటు ఎంపీ ఎన్నికల్లో తాను సిఫారసు చేసిన అభ్యర్థులకు టికెట్లు ఇప్పించడంలో సీఎం రేవంత్‌రెడ్డి అనుకున్నది సాధించారు. కాని ఖ‌మ్మం టికెట్ మాత్రం పార్టీలో రేవంత్‌రెడ్డి ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టిన‌ట్టు తెలుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది