Pithapuram : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పిఠాపురం రాత మారిందనే చెప్పాలి. ఎన్నికల సమయంలో వీఐపీల తాకిడి, ప్రచారంతో ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంది పిఠాపురం. ఇక పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టడంతో ఇక పిఠాపురం పేరు మారుమ్రోగిపోతుంది. ఇటీవల కాకినాడ జిల్లా పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని భోగాపురం, ఇల్లింద్రాడ పరిధిలో 3.52 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఎన్నికల ముందు వరకు ఉన్న ధరలు ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయాయి. ఎక్కడెక్కడి వారో అక్కడ భూముల కోసం ఎగబడుతున్నారు… ఇంతలా ఆ నియోజకవర్గంలో భూములకు డిమాండ్ ఎందుకు ఏర్పడింది? ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చిందని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో రియల్ వ్యాపారం ఎలా ఉందన్న విషయం పక్కన పెడితే, పిఠాపురంలో మాత్రం భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత నెల రోజుల నుంచి పిఠాపురంలో రియల్ భూమ్‌తో పంట పొలాల ధరలు ఒక్కసారిగా రెండింతలయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంపై రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ ఉండటం…. పిఠాపురం రూపురేఖలు మార్చేస్తారనే అంచనాలతో ఈ నియోజకవర్గంలో భూములపై పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఒకప్పుడు 50 నుంచి 60 లక్షల రూపాయల ఉండే భూములు ధరలు ఇప్పుడు రెండు నుంచి మూడు రెట్లు పెరిగిపోయాయి. ఇలా ఒకేసారి ధరలు పెరగడానికి కారణం డిప్యూటీ సీఎం పవన్ కారణమని విశ్లేషిస్తున్నారు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు. గతంలో తమ ప్రాంతంలో ఈ స్థాయిలో రియల్ వ్యాపారం జరిగేది కాదని… పవన్ గెలిచిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో స్థిరపడిన వారు సైతం భూముల కోసం తమకు ఫోన్లు చేస్తున్నారని చెబుతున్నారు.
పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురంలో సొంత ఇల్లు, పార్టీ ఆఫీసు నిర్మాణానికి 3.52 ఎకరాలు భూమి కొన్నారు . రెండు ఎకరాల్లో పార్టీ ఆఫీసు, ఆ పక్కనే తన సొంత ఇల్లు నిర్మిస్తానని ప్రకటించారు. ఇక ఆ మరునాడు నుంచి పవన్ భూమికొన్న పరిసరాల్లో స్థలాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో తరలివస్తున్న రియల్ వ్యాపారులు… బేరాలు కూడా లేకుండా రైతులు చెప్పిన ధరకు అగ్రిమెంట్లు చేసుకుంటామని ఆఫర్లు ఇస్తున్నారు… . పవన్ భూములకు పక్కనున్న భూములను సొంతం చేసుకునేందుకు ఆ భూమి యజమానులను సంప్రదిస్తున్నట్లు సమాచారం అందుతుంది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.