Ys Sharmila : ష‌ర్మిళ ప్రాణాల‌కి ముప్పు పొంచి ఉందా.. అది ఎవ‌రి నుండి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Sharmila : ష‌ర్మిళ ప్రాణాల‌కి ముప్పు పొంచి ఉందా.. అది ఎవ‌రి నుండి ?

 Authored By ramu | The Telugu News | Updated on :31 October 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys Sharmila : ష‌ర్మిళ ప్రాణాల‌కి ముప్పు పొంచి ఉందా.. అది ఎవ‌రి నుండి ?

Ys Sharmila : ఆస్తి పంపకాల వ్యవహారంలో సొంత తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్ర‌తి ఒక్క‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సొంత తల్లి, చెల్లికే న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడని జగన్​పై ముప్పేట దాడి చేశారు. ధన దాహంతో కుటుంబ వ్యవస్థనే జగన్ రెడ్డి అగౌరవపరుస్తున్నాడని విమర్శించారు. తల్లి, చెల్లిని వీధికి లాగి ఆస్తికోసం వెంపర్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ రెడ్డిని చూసి విజయమ్మ ప్రాణ భయంతో పారిపోయిందని ప్రజలనుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమెకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలి వర్ల రామయ్య తెలిపారు.

Ys Sharmila ఎవ‌రి వ‌ల‌న అస‌లు స‌మ‌స్య‌..!

అయితే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ష‌ర్మిళ ప్ర‌తి చోట తిరుగుతూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేశారు. అప్పుడు ఎలాంటి సెక్యూరిటీ లేదు. కాని ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి సర్కార్ అధికారంలో ఉంది. ఆ ప్ర‌భుత్వంపై అంత‌గా విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. అయితే షర్మిల వర్సెస్ జగన్ ఆస్తుల వివాదం ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఈ క్ర‌మంలో ఇపుడు షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని ప్రచారం సాగుతోంది .ఆమెకు అర్జంటుగా టూ ప్లస్ సెక్యూరిటీ నుంచి ఫోరు ప్లస్ సెక్యూరిటీని పెంచాలని డిమాండ్ ని కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్నారు. ఈ మేరకు కొందరు కాంగ్రెస్ నేతలు డీజీపీని కలసి వినతిపత్రం సమర్పించారు. ఇంతకీ షర్మికకు ముప్పు ఎవరి నుంచి అన్న ప్రశ్న వస్తోంది అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Ys Sharmila ష‌ర్మిళ ప్రాణాల‌కి ముప్పు పొంచి ఉందా అది ఎవ‌రి నుండి

Ys Sharmila : ష‌ర్మిళ ప్రాణాల‌కి ముప్పు పొంచి ఉందా.. అది ఎవ‌రి నుండి ?

కూట‌మి ప్ర‌భుత్వం నుండి అయితే ష‌ర్మిళ‌కి అంత స‌మ‌స్య‌లేదు. ఇప్పుడు వ‌చ్చిందంతా వైసీపీ నుండే అంటున్నారు. ష‌ర్మిలతో పెట్టుకుని వైసీపీ సర్వ భ్రష్టత్వం చెందింది. ఇక ఆమె విషయంలో మరేదైనా జరిగితే వైసీపీ ఎంతటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో రాజకీయం చేసే వారికి తెలిసిన వారికీ బాగా ఎరుకే. అందువల్ల షర్మిలకు వైసీపీ వైపు నుంచి అయితే ఏ ముప్పూ లేదనే చెప్పాల్సి ఉంటుంది. మరి ఆమెకు ఎందుకు సెక్యూరిటీ సమస్య వచ్చింది అంటే అదే అర్ధం కాదని అంటున్నారు. అయితే ఇది కూడా రాజకీయంగా చూడాలా అంటే ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఏమైనా ఇబ్బంది ఉంటే కచ్చితంగా కూటమి ప్రభుత్వం సెక్యూరిటీని పెంచుతుంది. రానున్న రోజుల‌లో ఈ వివాదాలు మ‌రింత ముద‌ర‌డం ఖాయం అని, దీనిపై కూట‌మి ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఆలోచ‌న చేస్తున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది