Ys Sharmila : షర్మిళ ప్రాణాలకి ముప్పు పొంచి ఉందా.. అది ఎవరి నుండి ?
Ys Sharmila : ఆస్తి పంపకాల వ్యవహారంలో సొంత తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రతి ఒక్కరు విమర్శలు చేస్తున్నారు. సొంత తల్లి, చెల్లికే న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడని జగన్పై ముప్పేట దాడి చేశారు. ధన దాహంతో కుటుంబ వ్యవస్థనే జగన్ రెడ్డి అగౌరవపరుస్తున్నాడని విమర్శించారు. తల్లి, చెల్లిని వీధికి లాగి ఆస్తికోసం వెంపర్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ రెడ్డిని చూసి విజయమ్మ ప్రాణ భయంతో పారిపోయిందని ప్రజలనుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమెకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలి వర్ల రామయ్య తెలిపారు.
అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షర్మిళ ప్రతి చోట తిరుగుతూ ఆయనపై విమర్శలు చేశారు. అప్పుడు ఎలాంటి సెక్యూరిటీ లేదు. కాని ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి సర్కార్ అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వంపై అంతగా విమర్శలు చేయడం లేదు. అయితే షర్మిల వర్సెస్ జగన్ ఆస్తుల వివాదం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో ఇపుడు షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని ప్రచారం సాగుతోంది .ఆమెకు అర్జంటుగా టూ ప్లస్ సెక్యూరిటీ నుంచి ఫోరు ప్లస్ సెక్యూరిటీని పెంచాలని డిమాండ్ ని కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్నారు. ఈ మేరకు కొందరు కాంగ్రెస్ నేతలు డీజీపీని కలసి వినతిపత్రం సమర్పించారు. ఇంతకీ షర్మికకు ముప్పు ఎవరి నుంచి అన్న ప్రశ్న వస్తోంది అనేది చర్చనీయాంశంగా మారింది.
Ys Sharmila : షర్మిళ ప్రాణాలకి ముప్పు పొంచి ఉందా.. అది ఎవరి నుండి ?
కూటమి ప్రభుత్వం నుండి అయితే షర్మిళకి అంత సమస్యలేదు. ఇప్పుడు వచ్చిందంతా వైసీపీ నుండే అంటున్నారు. షర్మిలతో పెట్టుకుని వైసీపీ సర్వ భ్రష్టత్వం చెందింది. ఇక ఆమె విషయంలో మరేదైనా జరిగితే వైసీపీ ఎంతటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో రాజకీయం చేసే వారికి తెలిసిన వారికీ బాగా ఎరుకే. అందువల్ల షర్మిలకు వైసీపీ వైపు నుంచి అయితే ఏ ముప్పూ లేదనే చెప్పాల్సి ఉంటుంది. మరి ఆమెకు ఎందుకు సెక్యూరిటీ సమస్య వచ్చింది అంటే అదే అర్ధం కాదని అంటున్నారు. అయితే ఇది కూడా రాజకీయంగా చూడాలా అంటే ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఏమైనా ఇబ్బంది ఉంటే కచ్చితంగా కూటమి ప్రభుత్వం సెక్యూరిటీని పెంచుతుంది. రానున్న రోజులలో ఈ వివాదాలు మరింత ముదరడం ఖాయం అని, దీనిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.