Revanth Reddy : ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి. ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇటు బీఆర్ ఎస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే ఆ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతోంది. అంతే కాకుండా వరుసగా పార్టీ నేతలపై వస్తున్న భూకబ్జా ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇరుకున పెట్టేస్తున్నాయి. వాటికి తోడు అటు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ కావడం కూడా సంచలనంగా మారిపోయింది. దాంతో ఇప్పుడు బీఆర్ ఎస్ ను నేతలు వీడిపోతున్నారు.మాజీ మంత్రులు, టికెట్లు రాని వారు, సిట్టింగ్ ఎంపీలు కూడా వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇద్దరు వెళ్లారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అయితే వీరిద్దరికీ ఇప్పుడు షాక్ తగిలింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇందులో కొన్ని ప్రతిపాదనలు బలంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి మరో పార్టీలోకి వెళ్లాలంటే తన పదవికి రాజీనామా చేయాలి. ఆ తర్వాతనే వేరే పార్టీలోకి వెళ్లాలి అనేది రాహుల్ గాంధీ ప్రతిపాదన.ఆ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఇప్పుడు కడియం, దానం కు షాక్ ఇస్తోంది. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోను ఫాలో అవుతాడని అంటుననారు. దాని వల్ల వీరిద్దరికీ షాక్ తప్పదని చెబుతున్నారు. వీరిద్దరితో త్వరలోనే రాజీనామా చేయిస్తారేమో అని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. రాజీనామా చేసినా సరే తిరిగి అక్కడ వీరే గెలుస్తారని అంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారమే నడుచుకుంటారేమో అని అంటున్నారు. అటు మాజీ మంత్రికేటీఆర్ కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని స్వాగిస్తున్నట్టు చెప్పారు. రాహుల్ గాంధీకి తన మేనిఫెస్టో మీద చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరిలతో రాజీనామాలు చేయించి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో ఇప్పుడు కడియం, దానంల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.