Roja VS Bandaru : దయచేసి మా అమ్మని వదిలేయండి.. రోజా కూతురు రిక్వెస్ట్.. షాక్‌లో రోజా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja VS Bandaru : దయచేసి మా అమ్మని వదిలేయండి.. రోజా కూతురు రిక్వెస్ట్.. షాక్‌లో రోజా?

 Authored By kranthi | The Telugu News | Updated on :7 October 2023,8:00 pm

Roja VS Bandaru : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ మీద ఉన్న చర్చ కాస్త దారి తప్పి ఏకంగా రోజా మీదికి వెళ్లింది. మంత్రి రోజా.. చంద్రబాబు అరెస్ట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, బాలకృష్ణ, భువనేశ్వరి, బ్రాహ్మణిలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి.. రోజాపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. రోజా.. నీ గురించి ఎవరికి తెలియదు. నువ్వేంటో.. నీ బతుకేంటో అందరికీ తెలుసు. నువ్వు మాకు నీతులు చెబుతున్నావా.. నువ్వు ఆ సినిమాల్లో నటించింది నిజం కాదా? ఆ సీడీలన్నీ బయటపెడతా అంటూ బండారు సత్యనారాయణ రోజాపై రెచ్చిపోయారు. అసలు రోజా అలాంటి సినిమాల్లో నటించిందా? మరీ అంత దారుణంగా ఒక మహిళ గురించి అలా మాట్లాడుతారా ఎవరైనా అంటూ పలువురు బండారు వ్యాఖ్యలను వ్యతిరేకించారు.

రోజా కూడా బండారు వ్యాఖ్యలపై స్పందించి ఆయనపై కేసు నమోదు చేయడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ కూడా వచ్చింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం అనేది కరెక్ట్ కాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా అయితే మహిళలు రాజకీయాల్లో రాణించడం కరెక్టేనా? కొత్త తరం మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా రోజా విషయంపై తన కూతురు కూడా స్పందించినట్టు తెలుస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మను ఇప్పుడు ఇలా చూస్తే ఏడుపొస్తుంది. తన తల్లిని వదిలేయండి.. అంటూ కుటుంబ సభ్యుల ముందు వాపోయిందట రోజా కూతురు. నేను చిన్నపిల్లను.. అమ్మను ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఎప్పుడూ అమ్మను అలా చూడలేదు. అమ్మ అలా దిగులుగా ఉంటే నాకు భోజనం కూడా తినాలనిపించడం లేదు.. అంటూ రోజా కూతురు వాపోయినట్టు తెలుస్తోంది.

roja daughter comments on bandaru satyanarayana

#image_title

Roja VS Bandaru : ఈ విషయంపై స్పందించిన రోజా భర్త

అయితే.. ఈ విషయంపై రోజా భర్త కూడా స్పందించారు. ఆయన ఘాటుగానే స్పందించారు. ఇప్పటికీ పలువురు సినీ నటులు రోజాకు అండగా నిలబడి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని చెప్పారు. నటి ఖుష్బూ, నటి రాధిక.. రోజాకు మద్దతు పలికారు. రోజాకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. తాజాగా రోజా కూతురు చేసిన కామెంట్స్ పై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది