Ycp : వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. ఇప్పుడు మరో వికెట్ డౌన్..!
Ycp : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఒకరిద్దరు ఇప్పటికీ తెలుగుదేశం కూటమి సర్కార్ పై నోరు పారేసుకుంటున్నా.. వారిని జనం పట్టించుకోవడం లేదు. ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు పలువురు రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నైరాశ్యంలోకి వెళ్లారు. ఈ క్రమంలో పక్కచూపులు […]
ప్రధానాంశాలు:
Ycp : వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. ఇప్పుడు మరో వికెట్ డౌన్..!
Ycp : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఒకరిద్దరు ఇప్పటికీ తెలుగుదేశం కూటమి సర్కార్ పై నోరు పారేసుకుంటున్నా.. వారిని జనం పట్టించుకోవడం లేదు. ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు పలువురు రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నైరాశ్యంలోకి వెళ్లారు. ఈ క్రమంలో పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నలుగురికి పైగా పార్టీని వీడగా త్వరలోనే భారీగా రాజీనామాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన కీలక నాయకుడు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైన నేత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.
Ycp పెద్ద దెబ్బే..
జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేరిపోయారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరడానికి రెడీ అయిపోయారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం నిజమే అనడానికి గత కొద్ది కాలంగా సామినేని ఉదయభాను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటమే తార్కాణమంటున్నారు పరిశీలకులు. అయితే ఉదయభానుకు వైసీపీ అధికారంలో ఉండగా జనసేనకు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రచారం ఇప్పుడు అవరోధంగా మారుతోంది. జనసేన శ్రేణులు ఉదయభానును పార్టీలో చేర్చుకోవద్దంటూ పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారంటున్నారు. గతంలో జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో జనసేన ఏర్పాటు చేసిన జెండా దిమ్మెను ఉదయభాను ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ధ్వసం విషయాన్ని జనసేన కార్యకర్తలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
నాడు దిమ్మె ధ్వంసంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన జనసేన నాయకులు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయించిన ఉదయభానును పార్టీలో ఎలా చేర్చుకుంటారని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటికీ తోడు జనసేనలో చేరడానికి ఉదయభాను కొన్ని కండీషన్లు పెట్టారనీ, వాటిలో ప్రధానంగా తనకు జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షపదవి ఇవ్వాలనీ కోరుతున్నారని అంటున్నారు. దీనిని కూడా జనసైనికులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తం మీద సామినేని ఉదయభానుకు జనసేనలో ఎంట్రీ వచ్చినా రాకున్నా ఆయన మాత్రం వైసీపీని వీడడం ఖాయమైందని పరిశీలకులు చెబుతున్నమాట. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.