సర్వేలు పాతబడ్డాయి.. జ్యోతిష్యాలదే ఇప్పుడు ట్రెండ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

సర్వేలు పాతబడ్డాయి.. జ్యోతిష్యాలదే ఇప్పుడు ట్రెండ్..!

రాజకీయాల్లో ఆశలు అనేవి చిన్న స్థాయి కార్యకర్త నుంచి సీఎం స్థాయి వ్యక్తి దాకా ఉంటాయి. నాకు ఆ పదవి దక్కతుందని ఒకరు.. నేను ఎమ్మెల్యే అవుతానని ఇంకో వ్యక్తి ఇలాంటి ఆశలతోనే రాజకీయాల్లో రాణిస్తుంటారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది మొన్నటి వరకు సర్వేలు చెప్పేవి. అందునా ఏపీ రాజకీయాల్లో ఇలాంటి సర్వేలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో ఉన్నంత వాడి వేడి ఇంకెక్కడా ఉండదు. అందుకే ఏపీలో సర్వేలకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 May 2024,7:00 pm

రాజకీయాల్లో ఆశలు అనేవి చిన్న స్థాయి కార్యకర్త నుంచి సీఎం స్థాయి వ్యక్తి దాకా ఉంటాయి. నాకు ఆ పదవి దక్కతుందని ఒకరు.. నేను ఎమ్మెల్యే అవుతానని ఇంకో వ్యక్తి ఇలాంటి ఆశలతోనే రాజకీయాల్లో రాణిస్తుంటారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది మొన్నటి వరకు సర్వేలు చెప్పేవి. అందునా ఏపీ రాజకీయాల్లో ఇలాంటి సర్వేలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో ఉన్నంత వాడి వేడి ఇంకెక్కడా ఉండదు. అందుకే ఏపీలో సర్వేలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏపీలో పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.

జ్యోతిష్యులే ట్రెండింగ్ లోకి..

పోలింగ్ కు ముందు చాలా సర్వేలు బయటకు వచ్చాయి. ఫలానా పార్టీ గెలుస్తుందని కొన్ని చెబితే.. ఫలానా పార్టీ గెలుస్తుందని ఇంకొన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. అయితే ఇప్పుడు పోలింగ్ ముగిసింది కాబట్టి ఏ సర్వేలు బయటకు చెప్పడానికి వీల్లేదు. మే 1 తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ అన్నీ తెలుస్తాయి. అయితే ఈ గ్యాప్ లో ఇప్పుడు జోస్యాలు అనేవి ట్రెండింగ్ లోకి వచ్చాయి. జ్యోతిష్య పండితులు తెరమీదకు వస్తున్నారు. అంతే కాకుండా సంఖ్యా శాస్త్రం చెప్పే నిపుణులు, గవ్వలతో జోస్యం చెప్పేవారు ఎక్కువ అవుతున్నారు. దాంతో వారిని మీడియా కూడా ఇంటర్వ్యూలు చేస్తూ హైలెట్ చేస్తోంది. వేణుస్వామి లాంటి వారు ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటున్నారు.

రాజకీయ పార్టీల అధ్యక్షుల రాశులు, వారి జాతకాలను బట్టి ఆయనే సీఎం అవుతాడని కొందరు చెబుతున్నారు. లేదు లేదు ఈయన జాతకంలో రాజయోగం ఉంది కాబట్టి ఈయన సీఎం అవుతాడని ఇంకో జ్యోతిష్యుడు చెబుతున్నాడు. ఫలానా వ్యక్తికి మంత్రి పదవి ఖాయం అని ఒకరు.. ఆ నేత ఓడిపోతున్నాడంటూ మరో జ్యోతిష్యుడు చెప్పేస్తున్నారు. ఈ నేత జాతకంలో అసలు రాజయోగమే లేదు కాబట్టి ఆయన జీవితంలో సీఎం కాలేడని ఒకరు చెబితే.. అబ్బే అదేం లేదు ఆయన కచ్చితంగా సీఎం అవుతాడని జ్యోతిష్యం చెబుతోందని మరొకరు అంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకే నేత, ఒకే జాతకాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. అయినా సరే పార్టీ లీడర్లు తమకు ఏ చిన్న అనుకూలంగా ఉన్న దాన్ని అయినా సరే సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని సంతృప్తి పొందుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది