Medigadda Review : నాలుగు కోట్ల ప్ర‌జ‌ల సొమ్ము.. అన్నారం, సుందిళ్ళ‌, మేడిగ‌డ్డ ప్రాజెక్టులపై ల‌క్ష కోట్లు నీళ్ల పాళ్లు.. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Medigadda Review : నాలుగు కోట్ల ప్ర‌జ‌ల సొమ్ము.. అన్నారం, సుందిళ్ళ‌, మేడిగ‌డ్డ ప్రాజెక్టులపై ల‌క్ష కోట్లు నీళ్ల పాళ్లు.. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

Medigadda Review : తెలంగాణ మంత్రుల బృందం ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్ట్ ను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీకి బుంగలు పడ్డ చోటును మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. లక్ష కోట్లతో లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీపై […]

 Authored By gatla | The Telugu News | Updated on :29 December 2023,6:48 pm

ప్రధానాంశాలు:

  •  Medigadda Review : నాలుగు కోట్ల ప్ర‌జ‌ల సొమ్ము.. అన్నారం, సుందిళ్ళ‌, మేడిగ‌డ్డ ప్రాజెక్టులపై ల‌క్ష కోట్లు నీళ్ల పాళ్లు.. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

  •  మేడిగడ్డపై రివ్యూ.. లక్ష కోట్లతో కట్టిన బ్యారేజీలకే డ్యామేజీలు.. మంత్రి ఉత్తమ్ మండిపాటు

Medigadda Review : తెలంగాణ మంత్రుల బృందం ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్ట్ ను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీకి బుంగలు పడ్డ చోటును మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. లక్ష కోట్లతో లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు.ప్రాణహిత పూర్తయితే అందరికీ నీళ్లు వచ్చేవన్నారు.

వెయ్యి కోట్ల మోటార్లకు రూ.4 వేల కోట్ల బిల్లులు వేశారన్నారు. పల్లానికి వచ్చే నీళ్లను ఆ తుగ్లక్ రాకుండా చేశాడు. సర్కార్ కు ఇరిగేషన్ పెండింగ్ బిల్లులు దాదాపు 9 వేల కోట్లు ఉన్నాయన్నారు. కుట్ర కోణం అనేదే విచిత్రంగా ఉందన్నారు. ప్రాజెక్టులో ఉన్న లోపాలన్నీ మానవ తప్పిదాలే. లోపాలపై నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. మేడిగడ్డ సందర్శనపై సీఎం రేవంత్ రెడ్డికి రెండు మూడు రోజుల్లో నివేదిక అందిస్తాం. ఇలాంటి నాసిరకం నిర్మాణాన్ని ఎక్కడా చూడలేదు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం అనేది త్వరలోనే ప్రకటిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం అయినప్పటి నుంచే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి.

పక్కా ప్లాన్ తో ప్రాజెక్ట్ లొకేషన్ ను కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చింది. 5 ఫీట్లు లోతుకు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి.. ఇది అద్భుతమైన ప్రాజెక్టా… మరి అది కుంగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. లక్ష కోట్లు పెట్టి మూడు బ్యారేజీలు కట్టారు.. ఆ బ్యారేజీలే ఇప్పుడు డ్యామేజ్ అయ్యాయని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు.కాళేశ్వరం ప్రాజెక్టు ను మొదటి నుంచి వ్యతిరేకించా. కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా లోపాలు ఉన్నాయి. బ్యాక్ వాటర్ పై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. నాలుగేళ్లుగా ముంపుతో రైతులు నష్టపోతున్నారు. సీఎంతో మాట్లాడి త్వరగా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్. 2 టీఎంసీల పనే పూర్తి కాలేదు.. మూడో టీఎంసీకి ఖర్చు పెట్టారు. బ్యాక్ వాటర్ పై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అన్నారు.

Medigadda Review నాలుగు కోట్ల ప్ర‌జ‌ల సొమ్ము అన్నారం సుందిళ్ళ‌ మేడిగ‌డ్డ ప్రాజెక్టులపై ల‌క్ష కోట్లు నీళ్ల పాళ్లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

Medigadda Review : నాలుగు కోట్ల ప్ర‌జ‌ల సొమ్ము.. అన్నారం, సుందిళ్ళ‌, మేడిగ‌డ్డ ప్రాజెక్టులపై ల‌క్ష కోట్లు నీళ్ల పాళ్లు.. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది