AP Elections Results : ఏపీ ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. రేపు రిజల్ట్స్ రానున్న నేపథ్యంలో వాటి కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ పార్టీల నేతలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసిపి, ఈసారైనా ఎన్నికల్లో విజయం సాధించాలని టిడిపి కూటమి హోరాహోరీగా ఎన్నికల సమరం చేశారు. ఇక ఫైనల్ రిజల్ట్స్ విషయంలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. గెలుపు ధీమాలో ఇరు వర్గాలు ఉండడం ఏపీ ప్రజలను కన్ఫ్యూషన్ కు గురిచేస్తుంది. ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా సాగడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
పోలింగ్ ముగిసిన వెంటనే విజేతలు ఎవరనే దానిపై మొదలైన సస్పెన్స్.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్‌తో దీనిపై ఓ స్పష్టత వస్తుందని భావించినా.. అందులోనూ సేమ్ సీన్ కనిపించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పలు ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే విజయం అంటుంటే.. మరికొన్ని మాత్రం ఏపీలో కింగ్ కూటమే అని అంచనా వేశాయి. దీంతో గత 20 రోజులుగా ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. భిన్నమైన అంచనాలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ రాజకీయ పార్టీ శ్రేణులను కన్ఫ్యూజన్‌లో పడేశాయి. తమకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని.. ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అంటూ నేతలు విమర్శలు గుప్పించారు.
ఎగ్జిట్‌పోల్స్ గందరగోళంగా ఉన్నాయని.. లోకల్ సర్వేలు తమకు పాజిటివ్‌గా ఉన్నాయని వైసీపీ తెలిపింది. ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. రెండు వర్గాలు కబడ్డీ ఆడుతుంటే, కబడ్డీ ఆడుతున్న వాళ్ళకంటే, బరి బయట నిలుచును చూస్తున్నవాళ్లే ఆడుతున్న వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్న ఒక వీడియో ఏపీ ప్రజల మానసికస్థితికి అద్దం పడుతుంది. ఏపీలో ప్రజలే ఈసారి ఎన్నికలను రాజకీయ వర్గాల కంటే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈసారి టిడిపి కూటమి గెలిచి తీరుతుంది అని కొందరు, సవాలే లేదు వైసీపీ దే విజయమని మరికొందరు, మేము ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తాలూకా కానీ ఇంకొందరు హల్చల్ చేస్తున్నారు
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.