AP Elections Results : ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై పెర‌గుతున్న టెన్ష‌న్.. అంద‌రిలో పెరిగిన తీవ్ర ఉత్కంఠ‌ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

AP Elections Results : ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై పెర‌గుతున్న టెన్ష‌న్.. అంద‌రిలో పెరిగిన తీవ్ర ఉత్కంఠ‌

AP Elections Results  : ఏపీ ఎన్నిక‌లు స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారాయి. రేపు రిజ‌ల్ట్స్ రానున్న నేప‌థ్యంలో వాటి కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ పార్టీల నేతలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసిపి, ఈసారైనా ఎన్నికల్లో విజయం సాధించాలని టిడిపి కూటమి హోరాహోరీగా ఎన్నికల సమరం చేశారు. ఇక ఫైనల్ రిజల్ట్స్ విషయంలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. గెలుపు ధీమాలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 June 2024,4:00 pm

AP Elections Results  : ఏపీ ఎన్నిక‌లు స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారాయి. రేపు రిజ‌ల్ట్స్ రానున్న నేప‌థ్యంలో వాటి కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ పార్టీల నేతలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసిపి, ఈసారైనా ఎన్నికల్లో విజయం సాధించాలని టిడిపి కూటమి హోరాహోరీగా ఎన్నికల సమరం చేశారు. ఇక ఫైనల్ రిజల్ట్స్ విషయంలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. గెలుపు ధీమాలో ఇరు వర్గాలు ఉండడం ఏపీ ప్రజలను కన్ఫ్యూషన్ కు గురిచేస్తుంది. ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా సాగడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవ‌చ్చు.

పోలింగ్ ముగిసిన వెంటనే విజేతలు ఎవరనే దానిపై మొదలైన సస్పెన్స్‌.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్‌తో దీనిపై ఓ స్పష్టత వస్తుందని భావించినా.. అందులోనూ సేమ్ సీన్ కనిపించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పలు ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే విజయం అంటుంటే.. మరికొన్ని మాత్రం ఏపీలో కింగ్ కూటమే అని అంచనా వేశాయి. దీంతో గత 20 రోజులుగా ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. భిన్నమైన అంచనాలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌ రాజకీయ పార్టీ శ్రేణులను కన్ఫ్యూజన్‌లో పడేశాయి. తమకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్‌ నిజమవుతాయని.. ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అంటూ నేతలు విమర్శలు గుప్పించారు.

AP Elections Results ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై పెర‌గుతున్న టెన్ష‌న్ అంద‌రిలో పెరిగిన తీవ్ర ఉత్కంఠ‌

AP Elections Results : ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై పెర‌గుతున్న టెన్ష‌న్.. అంద‌రిలో పెరిగిన తీవ్ర ఉత్కంఠ‌

ఎగ్జిట్‌పోల్స్‌ గందరగోళంగా ఉన్నాయని.. లోకల్‌ సర్వేలు తమకు పాజిటివ్‌గా ఉన్నాయని వైసీపీ తెలిపింది. ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. రెండు వర్గాలు కబడ్డీ ఆడుతుంటే, కబడ్డీ ఆడుతున్న వాళ్ళకంటే, బరి బయట నిలుచును చూస్తున్నవాళ్లే ఆడుతున్న వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్న ఒక వీడియో ఏపీ ప్రజల మానసికస్థితికి అద్దం పడుతుంది. ఏపీలో ప్రజలే ఈసారి ఎన్నికలను రాజకీయ వర్గాల కంటే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈసారి టిడిపి కూటమి గెలిచి తీరుతుంది అని కొందరు, సవాలే లేదు వైసీపీ దే విజయమని మరికొందరు, మేము ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తాలూకా కానీ ఇంకొందరు హల్చల్ చేస్తున్నారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది