Vaishnavi Chaitanya : బేబి హీరోయిన్ మాముల్ది కాదు.. సుమపైనే అలాంటి సెటైర్ వేసిందంటే..!
Vaishnavi Chaitanya : బేబి సినిమాతో వైష్ణవి చైతన్యకు మంచి క్రేజ్ వచ్చింది. అంతకు ముందు యూట్యూబ్ భామగానే ఉన్న ఈ అమ్మడు షార్ట్ ఫిల్మ్స్ అంటూ బాగానే క్రేజ్ దక్కించుకుంది. బేబి మూవీతో టాలీవుడ్‌లో ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. తెలుగమ్మాయికి చాలా రోజుల తరువాత ఇలాంటి ఓ భారీ హిట్ రావడం, ఆమె పేరు టాలీవుడ్‌లో వినిపించడం జరిగింది. అయితే బేబి తరువాత వైష్ణవికి చాలానే ఆఫర్లు వచ్చాయి. వైష్ణవి ఆచితూచి కథలను ఎంచుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆశిష్‌తో కలిసి లవ్ మీ అనే సినిమాను చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తేడా కొట్టేసింది. విడుదలైన మూడు వారాల్లోపే ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోన్న పరిస్థితికి వచ్చింది. అలా ఈ సినిమా ఫలితం పక్కన పెడితే.. ప్రమోషన్స్ మాత్రం భారీ స్థాయిలో చేశాడు.
ఇక చిత్ర యూనిట్ కూడా పలు షోలకి హాజరవుతూ సందడి చేస్తూ వచ్చింది. అయితే సుమ హోస్ట్ చేస్తున్న సుమ అడ్డా షోకి కూడా వీరిద్దరు హాజరై సందడి చేశారు. గతంలో శనివారం ప్రసారమయ్యే ఈ షో ఇప్పుడు మంగళవారం ప్రసారం అవుతుంది. లవ్ మీ చిత్ర యూనిట్ ఆశిష్ రెడ్డి, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య షోలో తెగ రచ్చచేశారు. ఇక ప్రోమోలో మంగళ వారం అంజనేయ స్వామి సెంటిమెంట్ కాబట్టి.. సుమ ఆంజనేయ స్వామికి పూజలు చేసింది సుమ. అప్పుడు సుమతో ఆంజనేయ స్వామి.. ఏంటమ్మా నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర కదా ఉండాలసింది అని అడుగుతారు. ఇక నుంచి మీ దయతో మంగళవారం ఎంటర్టైన్మెంట్ అందిద్దాం అనుకుంటున్నా స్వామి.. మీ ఆశీస్సులు కావాలి అని అడుగుతుంది. తధాస్తు అని ఆంజనేయ స్వామి అంటారు.
Vaishnavi Chaitanya : బేబి హీరోయిన్ మాముల్ది కాదు.. సుమపైనే అలాంటి సెటైర్ వేసిందంటే..!
ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ సెలెబ్రేషన్ ఈవెంట్స్ కూడా అన్ని నాకే వచ్చేలా చూడు అని అడుగుతుంది. దీనితో ఆంజనేయ స్వామి.. నా చేతిలో ఏముంది అని అడుగుతారు.. గద అని చెబితే.. అది ఇచ్చుకు కొడతా అని వార్నింగ్ ఇస్తారు. ఇక లవ్ మీ చిత్ర యూనిట్ తో సుమ భలే సందడి చేసింది. దెయ్యాన్ని ప్రేమించడం మంచిదా, మనిషిని ప్రేమించడం మంచిదా అని సుమ ఆశిష్ రెడ్డిని అడుగుతుంది. దీనితో ఆశిష్ రెడ్డి దెయ్యమే బెటర్ అని అంటే.. అందుకేనా మా వారు నన్ను ప్రేమించారు అంటూ సుమ నవ్వులు పూయించింది. దెయ్యాలు ఎందుకు రాత్రిళ్ళు మాత్రమే తిరుగుతాయి అని సుమ వైష్ణవిని అడిగింది. దానికి ఆమె సమాధానం ఇస్తూ దెయ్యాలు పగలు ఇలా షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటాయి అని సుమపై సెటైర్ వేసింది. వైష్ణవి సెటైర్ కి సుమ ఆశ్చర్యపోయింది.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.