Allu Arjun RCB Victory Parade : అప్పుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు… మరి ఇప్పుడు ఎవర్ని అరెస్ట్ చేస్తారు..?
ప్రధానాంశాలు:
Allu Arjun RCB Victory Parade : అప్పుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు... మరి ఇప్పుడు..?
Allu Arjun RCB Victory Parade : నిన్న బెంగుళూరు లోని చినస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని రేపుతోంది. భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చిన సమయంలో భద్రత చర్యలు తగినవిగా లేకపోవడంతో ఒకేసారి తొక్కిసలాట జరిగి, తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు, నెటిజన్లు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు..

Allu Arjun RCB Victory Parade : అప్పుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు… మరి ఇప్పుడు ఎవర్ని అరెస్ట్ చేస్తారు..?..?
Allu Arjun RCB Victory Parade : పుష్ప 2 తొక్కిసలాటకు బన్నీ కారణమైతే.. మరి దీనికి ఎవరు కారణం..?
ఈ నేపథ్యంలో నెటిజన్లు గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఘటనను మళ్లీ గుర్తు చేస్తున్నారు. Pushpa 2 సినిమా ప్రీ రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళా మృతి చెందగా, ఆ ఘటనకు బాద్యులు గా అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసారు. ఇప్పుడు బెంగుళూరులో జరిగిన ఘోర ఘటనలో 11 మంది మృతి చెందిన నేపథ్యంలో “ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని గతంలో తీసుకున్న చర్యలు, ఇప్పుడు ప్రభుత్వ నిర్వాహకుల వైఫల్యం ఎదుర్కొంటున్నా అదే స్థాయిలో బాధ్యత వహించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ విషయంలో తీసుకున్న చర్యలను ఇప్పటి ఘటనతో పోల్చుతూ, నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.