Caste Survey : కులగణన సర్వేలో మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అంతే సంగతి..!
Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల గణన మాత్రమే జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి ఓబీసీ వర్గాలు, వారి ఉపవర్గాల వివరాలు కూడా ప్రత్యేక కాలమ్‌ల ద్వారా నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ గణన పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జియో-ఫెన్సింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను ఇందులో వినియోగించనున్నారు. మొత్తం మీద ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు ఈ గణన ఉపయోగపడనుంది.
Caste Survey : కులగణన సర్వేలో మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అంతే సంగతి..!
జనగణన చట్టం 1948 ప్రకారం.. ఈ గణనలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం తప్పనిసరి. ఉదాహరణకు – వయస్సు, లింగం, విద్యా స్థాయి, ఉద్యోగ వివరాలు, నివాస స్థలం, నివాస కాలం వంటి విషయాలను చెప్పకపోతే జరిమానా విధించే అవకాశముంది. కానీ మతం, ఆరోగ్య స్థితి, రాజకీయ అభిమతం వంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఐచ్ఛికం. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఎవ్వరూ బలవంతంగా అడగలేరు.
ఇక కుల వివరాల విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఈ అంశం పై స్పష్టమైన చట్టపరమైన బలవంతం లేదు. అంటే ఒక వ్యక్తి తన కులాన్ని చెప్పకపోతే, దానిపై ఎటువంటి శిక్షా విధించదగిన నిబంధన లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ద్వారా దీనిపై స్పష్టత ఇవ్వనుంది. కులం చెప్పడాన్ని తప్పనిసరిగా చేయాలా, లేక ఐచ్ఛికంగా ఉంచాలా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ ప్రక్రియ ప్రారంభించే ముందు చట్టపరమైన మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.