Pakistani Terror Camps : భారత్ ధ్వంసం చేసిన పాక్ ఉగ్రస్థావరాలు ఇవే..!
Pakistani Terror Camps : భారత సైన్యం పాక్ ఉగ్రవాదానికి గట్టి షాక్ ఇచ్చింది. పాక్ లోని మొత్తం 9 ఉగ్రస్థావరాలను భారత దళాలు ధ్వంసం చేశాయి. ఈ స్థావరాలు అంతర్జాతీయ సరిహద్దు మరియు నియంత్రణ రేఖకు 10 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ప్రధానంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతం మరియు పాకిస్తాన్ అంతర్భాగంలో ఉన్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలకు చెందిన శిక్షణా శిబిరాలే లక్ష్యంగా మారాయి.
Pakistani Terror Camps : భారత్ ధ్వంసం చేసిన పాక్ ఉగ్రస్థావరాలు ఇవే..!
Pakistani Terror Camps పాక్ ఉగ్రస్థావరాలను నామరూపాలు లేకుండా చేసిన భారత సైన్యం
ఈ దాడుల్లో భారత సైన్యం ముఖ్యంగా జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్న బహవల్‌పూర్ నగరాన్ని టార్గెట్ చేసింది. అంతేగాక మురిడ్కే, గుల్పూర్, బర్నాలా, సవాయ్ లష్కరే క్యాంప్ వంటి ప్రదేశాల్లో ఉన్న ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశారు. పూంఛ్-రాజౌరీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న లాంచ్‌ప్యాడ్లు బిలాల్ క్యాంప్, సర్జల్ క్యాంప్‌లు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ క్యాంపులు ఉగ్రవాదులను భారత్‌లోకి చొరబడించేందుకు వాడుతున్నట్లు భారత గూఢచార సంస్థల నివేదికలు తెలుపుతున్నాయి.
ఇంకా సియాల్‌కోట్ సమీపంలోని మెహమూనా క్యాంప్, లష్కరే తోయిబా క్యాంప్‌లు కూడా భారత సైన్యం ధ్వంసం చేసిన కీలక స్థావరాల్లో ఉన్నాయి. ఈ దాడులు పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద కార్యకలాపాలకు గట్టి హెచ్చరికగా మారాయి. ఉగ్రవాద నిర్మూలనకు భారత్ యొక్క నిబద్ధతను ఈ చర్యలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
