PM Kisan : పీఎం కిసాన్ ఈ నెల 18వ తేదీన డబ్బులు మీ ఖాతాలో పడాలంటే ఇలా చేయాల్సిందే..!
ప్రధానాంశాలు:
పీఎం కిసాన్ రైతులు పీఎం కిసాన్ ల్యాండ్ అడ్రస్ ఎలా అప్‌డేట్ చేసుకోవాలో ఇది చూస్తే అర్ధం అవుతుంది
పీఎం కిసాన్ రైతులకు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు farmers ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన Pradhan Mantri Kisan Samman Nidhi 20వ విడత త్వరలో విడుదల కానుంది. ఫిబ్రవరి 2025లో 19వ విడత విడుదలైన తర్వాత, ఈసారి జూన్‌లో రావాల్సిన వాయిదా ఆలస్యమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ నెల 18వ తేదీన రూ.2,000 మొత్తాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసే అవకాశముందని భావిస్తున్నారు. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు.

PM Kisan : పీఎం కిసాన్ ఈ నెల 18వ తేదీన డబ్బులు మీ ఖాతాలో పడాలంటే ఇలా చేయాల్సిందే..!
PM Kisan : అర్హత కోసం రైతులు చేయవలసిన పనులు
పీఎం కిసాన్ వాయిదా పొందాలంటే రైతులు ముందుగా కొన్ని ముఖ్యమైన ప్రక్రియలను పూర్తిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా e-KYC తప్పనిసరి, లేకపోతే వాయిదా పొందే అవకాశం ఉండదు. ఆధార్, బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం, ఖచ్చితమైన భూమి రికార్డులు అప్‌డేట్ చేయడం, లబ్ధిదారుడి స్టేటస్‌ను చెక్ చేసుకోవడం వంటి అంశాలను రైతులు పరిశీలించాలి. తప్పులు ఉన్నట్టయితే వెంటనే సరిచేసుకోవాలి, ముఖ్యంగా ల్యాండ్ అడ్రస్ లేదా ఖాతా నంబర్ తప్పుల వల్ల వాయిదా నిలిపివేసే అవకాశముంది.
అడ్రస్ మార్పు, e-KYC ఎలా చేయాలి?
భూమి అడ్రస్‌లో మార్పులు చేయాలంటే రైతులు అధికారిక వెబ్‌సైట్ ( pmkisan.gov.in )లో ‘State Transfer Request’ సెక్షన్‌లోకి వెళ్లి తమ ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌తో లాగిన్ అయి అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయవచ్చు. అదే విధంగా, e-KYC కోసం OTP ఆధారిత పద్ధతి, బయోమెట్రిక్ లేదా ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా పూర్తిచేయవచ్చు. సమస్యలు ఉన్న రైతులు తమ సమీప CSC సెంటర్‌ను సంప్రదించవచ్చు. వ్యవసాయ ఆదాయానికి నేరుగా మద్దతు అందించే ఈ పథకం ద్వారా eligible రైతులు ప్రతి సంవత్సరం రూ. 6వేలు పొందే అవకాశముంది.