Telangana Elections 2023 : టైమ్స్ నౌ సర్వేలో షాకింగ్ నిజాలు వెల్లడి.. ఈసారి తెలంగాణ ప్రజలు గెలిపించనున్న పార్టీ అదే
Telangana Elections 2023 : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయమే ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో టైమ్స్ నౌ ఓ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవనుందో స్పష్టం చేసింది. నిజానికి ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం ఉన్నా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పేసింది టైమ్స్ నౌ. అలాగే.. 2024 లో జరగబోయే లోక్ సభ ఎన్నికల గురించి కూడా టైమ్స్ నౌ చానెల్ సర్వే చేసింది. ఇక.. తెలంగాణలో ప్రజలు మరోసారి కేసీఆర్ వైపే ఉన్నారని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది.
తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని, ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టబోతోందని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది. తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు తిరుగులేదని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అయితే దరిదాపుల్లో కూడా లేవని టైమ్స్ నౌ తేల్చి చెప్పింది. కాంగ్రెస్, బీజేపీలకు మళ్లీ 2018 ఎన్నికల్లో పట్టిన గతే పట్టబోతోందని తెలిపింది.

#image_title
Telangana Elections 2023 : కేసీఆర్ హవా తగ్గలేదు
తెలంగాణలో కేసీఆర్ హవా తగ్గలేదని, లోక్ సభ ఎన్నికల్లోనూ గతంలో వచ్చిన స్థానాల కంటే కూడా ఎక్కువ స్థానాలను సాధిస్తుందని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 9 నుంచి 11 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. ఇక తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ 66 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ 37 సీట్లు గెలుస్తుందని టైమ్స్ నౌ చానెల్ స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ వైపే ఉన్నారని చెప్పిన టైమ్స్ నౌ సర్వే
తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు తిరుగులేదని.. కాంగ్రెస్, బీజేపీలు దరిదాపుల్లో సైతం లేవని తేల్చి చెప్పిన ప్రముఖ నేషనల్ ఛానల్ టైమ్స్ నౌ.
తెలంగాణలో కేసీఆర్ హవా ఏ మాత్రం తగ్గలేదని.. లోక్ సభ ఎన్నికల్లో గతంలో కంటే మరో… pic.twitter.com/uWMhfduuus
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2023