
Today Telugu Breaking News 22-11-2023
Today Telugu Breaking News : ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తున్న కర్ణాటక రైతులపై(Karnataka Farmers) కాంగ్రెస్ నేతలు(Congress Leaders) దాడికి దిగారు. మీరు ఇక్కడ ఎలా ధర్నా చేస్తారు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బూతులు తిట్టారు. ధర్నా చేస్తే మీ సంగతి చెప్తాం అంటూ నానా యాగీ చేశారు. కర్ణాటక రైతులను ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు బెదిరించారు.
5 నిమిషాల్లో రేవంత్ రెడ్డి(Revanth Reddy0 మాట మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడారు అని చెప్పిన రేవంత్ రెడ్డి వెంటనే మాట మార్చి.. తెలంగాణ ఆకాంక్షలు నీళ్లు, నిధులు, నియామకాలు కాదంటూ మాట మార్చారు.
బీజేపీ(BJP) మాత్రమే కాదు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ మోటార్లకు మీటర్లు పెడుతూ అదనంగా అప్పు తీసుకున్నారని మంత్రి హరీశ్ రావు(Harish Rao) స్పష్టం చేశారు. పూర్తి ఆధారాలతో హరీశ్ రావు బయటపెట్టారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ సహా 12 రాష్ట్రాలు కేంద్రం చెప్పినట్టుగా మోటార్లకు మీటర్లు పెట్టాయని… ఆయా రాష్ట్రాలు రూ.66,413 కోట్లు అదనంగా అప్పు తీసుకోవడానికి కేంద్రం అనుమతి ఇస్తూ 28 జూన్ 2023న కేంద్ర ప్రకటన విడుదల చేసిందని.. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం కూడా మోటార్లకు మీటర్లు పెట్టి అప్పు తీసుకుంటాం అని కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ లో తెలిపారని అన్నారు.
వైజాగ్(Vizag) లోని సంఘం శరత్ థియేటర్(Sharath Theatre) సమీపంలో స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఎనిమిది మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ముస్లిం నమాజ్ టోపీ విసిరికొట్టిన రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి కాంగ్రెస్ సభలో ముస్లిం పెద్దలు నమాజ్ టోపీ పెడుతుండగా చీదరించుకుంటూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) విసిరికొట్టారు.
నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case)లో ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సోనియా, రాహుల్ గాంధీ(Sonia Gandhi, Rahul Gandhi)లకు సంబంధించి ఢిల్లీ, ముంబై, లక్నోలో రూ.752 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ప్రముఖ సినీ నటి, టీడీపీ నేత దివ్యవాణి(Divya vani).. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే.. దివ్యవాణికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ కోసం బిడ్డలు చనిపోతుంటే సోనియా గాంధీ(Sonia Gandhi) బిచ్చం వేసిందని.. కాంగ్రెస్ నాయకురాలు, అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి(Atchampet Congress Candidate) భార్య అనురాధ అన్నారు.
తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టలేదు.. అందుకే నిధులు ఇవ్వలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) అన్నారు.
తెలంగాణ(Telangana Assembly Elections 2023) ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీలకు చెందిన 360 మంది అభ్యర్థుల్లో 226 మందికి నేర చరిత్ర ఉందని ఎన్నికల కమిషన్ తెలిపింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.