Sudigali Sudheer : హీరోయిన్ అందాలను పదేపదే చూస్తూ దొరికిపోయిన సుడిగాలి సుధీర్.. వీడియో !
Sudigali Sudheer : జబర్దస్త్ స్టార్ సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ కాలింగ్ సహస్ర ‘. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను కొత్త డైరెక్టర్ అరుణ్ విక్కిరాల దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా డాలీషా నటించారు. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతకాలపై విజయ్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వైరల్ అవుతున్న వీడియోలో సుడిగాలి సుధీర్ హీరోయిన్ డాలిషాను పదే పదే చూస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. దీంతో సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ మా వదినమ్మ రష్మీ ఏమైపోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది గాలోడు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధీర్ ఈ సినిమాతో ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి.
తాజాగా విడుదలైన కాలింగ్ సహస్ర ట్రైలర్ లో యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్ ఇలా సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగులు బాగా రాసుకున్నారు. నరకం అంటే మనసు చనిపోయి మనిషి బ్రతికి ఉండడం, ఇంతమందికి నరకం చూపించిన వాడికి నరకం అంటే ఏంటో నేను చూపిస్తా, భయం లో ఉన్నోడికి బాధ ఉండదు , బాధలో ఉన్న వాడికి భయం ఉండదు ఇలా ట్రైలర్ లో డైలాగులు అదరగొట్టేశారు. ఈ కాలింగ్ సహస్ర సినిమా ద్వారా సుడిగాలి సుదీర్ ని కొత్తగా చూపిస్తారని తెలుస్తోంది.
GST 2.0 : జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే…
Oneplus | ప్రీమియం లుక్, ఫీచర్స్ ఉన్న స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికీ మంచి సమయం ఇది. రూ.30,000 - రూ.40,000…
AP District Court Jobs | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న…
Bigg Boss9 | తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్బాస్ తెలుగు సీజన్ 9’ సెప్టెంబర్…
Anushka Shetty | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్పై…
Allari Naresh | అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమా మెహర్ రాజ్…
Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు "బ్రష్ చేసిన…
This website uses cookies.