
Today Top News : తెలంగాణలో జనసేనకు షాక్.. తొడ గొట్టి మరీ కబడ్డీ ఆడిన మంత్రి రోజా.. రాజకీయ పార్టీల గుర్తులు ప్రకటించిన ఈసీ
Today Top News : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో telangana assembly election 2023 పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలకు గుర్తులను ఎన్నికల సంఘం ప్రకటించింది.
తెలంగాణలో జనసేన పార్టీకి Janasena Party ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పార్టీకి ఎన్నికల గుర్తును కేటాయించలేదు. ఈసీ రూల్స్ ప్రకారం రాష్ట్రంలో జనసేన పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లేదు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగనున్నారు.
నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ BRS Party అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత kalvakuntla kavitha స్వయంగా కారు నడిపారు. ఎమ్మెల్యే ఇంటి నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు అంబాసిడర్ కారు నడిపి కార్యకర్తల్లో కవిత ఉత్సాహాన్ని నింపారు.
కొత్తగూడెంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జలగం వెంకటరావు Jalagam Venkat Rao
తాను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి Patel Ramesh Reddy అన్నారు. దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కోవర్ట్ అని, మంత్రి జగదీశ్ రెడ్డిని గెలిపించడానికే దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చారన్నారు. సర్వేలు తాను గెలుస్తానని చెప్పినా దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంలో ఆంతర్యమేంటి? పోయిన సారి అధిష్ఠానం బుజ్జగింపులతో తలొగ్గాను. ఈసారి తలొగ్గే ప్రసక్తే లేదు అని పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు.
సంగారెడ్డి బీజేపీ BJP అభ్యర్థిని మార్చారు. దేశ్ పాండే రాజేశ్వరరావును అభ్యర్ధిగా ప్రకటించి పులిమామిడి రాజుకు బీజేపీ బీఫాం ఇచ్చింది. దీంతో కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చి తనకు బీ ఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రాజేశ్వరరావు హెచ్చరించారు.
పటాన్ చెరువు బీఎస్పీ అభ్యర్థిగా నీలం మధును Neelam Madhu ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో వెంటనే నీలమధు బీఎస్పీలో చేరారు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంటనే నీలం మధును పటాన్ చెరువు బీఎస్పీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈరోజు నీలం మధు నామినేషన్ వేశారు.
రేవంత్ రెడ్డి Revanth reddy నువ్వు ఓటు నోటు కేసులో జైలు నుండి బైటికి వచ్చిన తరువాత ఏడుస్తూ వచ్చి నా కాళ్ళు పట్టుకున్న విషయం మర్చిపోయినవా? ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టావు.. బ్రోకరిజం, దందాలు బంజేయమని ఎన్నోసార్లు చెప్పినా నువ్వు వినలేదు – ఎర్రబెల్లి దయాకర్ రావు
కామారెడ్డి లో నామినేషన్ వేసిన రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి వెంట కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మంత్రి బోస్ రాజ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే ఉన్నారు.
పాకిస్థాన్ pakistan సెమీస్ చేరేందుకు అద్భుతమైన ఐడియా చెప్పిన వసీం అక్రమ్.. వరల్డ్ కప్ 2023లో 2023 Cricket World Cup పాకిస్థాన్ సెమీఫైనల్ చేరడానికి ఇంగ్లాండ్‌పై కనీసం 280 పరుగుల తేడాతో గెలవాల్సిన నేపథ్యంలో పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ తమ ఆటగాళ్లకు అదిరిపోయే ఐడియా ఇచ్చాడు. ముందు పాకిస్థాన్ బ్యాటింగ్ చేసి తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లు బ్యాటింగ్‌కు రాకుండా ఉండటం కోసం డ్రెస్సింగ్ రూమ్‌కు లాక్ వేయాలని అక్రమ్ సూచించాడు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. నామినేషన్లకు నేటితో గడువు ముగిసింది. నవంబర్ 10న నామినేషన్లు ముగిశాయి.
తొడ గొట్టి మరీ ఏపీ మంత్రి ఆర్కే రోజా కబడ్డీ ఆడారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.