
Shruti Hassan : కన్నతల్లిని చూసుకోకుండా వదిలేసిన శృతిహాసన్ .. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దారుణ స్థితి..!
Shruti Hassan : సినిమా ఇండస్ట్రీ అనేది ఒక జూదం లాంటిది. ఈరోజు వెలుగొందిన తారలు చివరి రోజుల్లో ఎలా ఉంటారో చెప్పలేం. ఒక్క సినిమా హిట్ అయితే ఓవర్ నైట్ లో స్టార్లు అయిపోతారు అలాగే ఒక్క సినిమా ఫ్లాప్ అయినా వాళ్ళ కెరియర్ మారిపోతుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో, హీరోయిన్లు క్రేజ్ ఉన్నప్పుడే వెనకేసుకోవాలి లేదంటే చివరి రోజుల్లో తిండికి కూడా లేక ఇబ్బందులు పడతారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న శృతిహాసన్ తల్లి ఒకప్పటి హీరోయిన్ అయినప్పటికీ ఆమె ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కమల్ హాసన్ కూతురిగా, సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శృతిహాసన్. తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆమె ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తన తల్లిని పట్టించుకోవడంలేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె చాలా రోజుల నుంచి తన తల్లికి దూరంగా ఉంటుందని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. అయితే రీసెంట్గా శృతిహాసన్ తల్లి సారిక ఓ ఇంటర్వ్యూలో తన కూతురు గురించి చెప్పుకొచ్చారు. ఒకప్పుడు హీరోయిన్గా నటించిన సారిక సినీ ప్రేక్షకులకు సుపరిచితం. తాజా ఇంటర్వ్యూలో ఆమె తన కూతురు తన వద్దకు రావడం లేదని, ఎక్కువగా మాట్లాడటం లేదని, కరోనా సమయంలో కూడా కమల్ హాసన్, శృతిహాసన్ ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని చెప్పారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ .. ఇప్పటికీ తాను స్వశక్తి మీదనే బ్రతుకుతున్నట్లు తెలిపారు. అలాగే ముంబైలో ఉంటూ రూమ్ రెంట్ కట్టుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇది తెలిసిన చాలా మంది సినీ అభిమానులు శృతిహాసన్ పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తన తల్లిని దూరంగా పెట్టి ఇబ్బంది పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శృతిహాసన్, కమల్ హాసన్ చెన్నైలోనే ఉంటున్నారు. కానీ ఆమె మాత్రం ముంబైలో ఒంటరిగా ఉంటున్నారు. ఈ వయసులో తల్లిని ఇబ్బంది పెట్టడం సరికాదని, ఆమెను కూడా మీ దగ్గర ఉంచుకోండి అని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. అయితే శృతిహాసన్ తల్లి సారిక కూడా ఒకప్పుడు హీరోయినే అయినా ఆమె ఆస్తులు అంతగా వెనకేసుకోలేనట్లుగా కనిపిస్తుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.