
Film Piracy : కేంద్ర సంచలన నిర్ణయం.. పైరసీకి పాల్పడ్డారా మూడేళ్ల జైలు తప్పదు.. జరిమానా కూడా..!
Film Piracy : సినిమా పైరసీని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైరసీ మార్గంగా సినిమా చిత్రాలను రికార్డ్ చేయడం, అక్రమంగా ప్రసారం చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటూ ‘సినిమాటోగ్రాఫీ చట్టం’లో సవరణలు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం, పైరసీలో పాలుపంచుకున్నవారికి గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష, అలాగే సినిమా నిర్మాణ వ్యయంలో 5% వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
Film Piracy : కేంద్ర సంచలన నిర్ణయం.. పైరసీకి పాల్పడ్డారా మూడేళ్ల జైలు తప్పదు.. జరిమానా కూడా..!
ఈ మార్పులు ఇప్పటికే పార్లమెంట్‌లో ఆమోదం పొందగా, త్వరలోనే దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు పైరసీకి సంబంధించిన నేరాలకు మాత్రమే మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 3 లక్షల వరకు జరిమానా మాత్రమే ఉండేది. కానీ పైరసీపై కఠినంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం శిక్షను గణనీయంగా పెంచింది.
ఈ సందర్భంగా ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ మాట్లాడుతూ, “ఇది కేవలం సినిమా పరిశ్రమను కాపాడటం కోసం కాదు. దేశీయ కంటెంట్ సృష్టికర్తలకు రక్షణ కల్పించాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. పైరసీ కారణంగా సినిమా నిర్మాతలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. కొత్త చట్టం ద్వారా వాటిని నిరోధించడమే లక్ష్యం” అని తెలిపారు.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని టాలీవుడ్, బాలీవుడ్, ఇతర భాషల చిత్ర పరిశ్రమలు అభినందిస్తున్నాయి. పైరసీ వల్ల కలెక్షన్లు తగ్గిపోతున్నాయని, ఓటీటీ ప్లాట్‌ఫామ్లలోకూడా డ్యామేజ్ జరుగుతోందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. కొత్త చట్టంతో పైరసీకి బలమైన అడ్డుకట్ట పడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
This website uses cookies.