Film Piracy : కేంద్ర సంచలన నిర్ణయం.. పైరసీకి పాల్పడ్డారా మూడేళ్ల జైలు తప్పదు.. జరిమానా కూడా..!
ప్రధానాంశాలు:
Film Piracy : కేంద్ర సంచలన నిర్ణయం.. పైరసీకి పాల్పడ్డారా మూడేళ్ల జైలు తప్పదు.. జరిమానా కూడా..!
Film Piracy : సినిమా పైరసీని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైరసీ మార్గంగా సినిమా చిత్రాలను రికార్డ్ చేయడం, అక్రమంగా ప్రసారం చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటూ ‘సినిమాటోగ్రాఫీ చట్టం’లో సవరణలు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం, పైరసీలో పాలుపంచుకున్నవారికి గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష, అలాగే సినిమా నిర్మాణ వ్యయంలో 5% వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

Film Piracy : కేంద్ర సంచలన నిర్ణయం.. పైరసీకి పాల్పడ్డారా మూడేళ్ల జైలు తప్పదు.. జరిమానా కూడా..!
Film Piracy : మంచి నిర్ణయం..
ఈ మార్పులు ఇప్పటికే పార్లమెంట్‌లో ఆమోదం పొందగా, త్వరలోనే దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు పైరసీకి సంబంధించిన నేరాలకు మాత్రమే మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 3 లక్షల వరకు జరిమానా మాత్రమే ఉండేది. కానీ పైరసీపై కఠినంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం శిక్షను గణనీయంగా పెంచింది.
ఈ సందర్భంగా ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ మాట్లాడుతూ, “ఇది కేవలం సినిమా పరిశ్రమను కాపాడటం కోసం కాదు. దేశీయ కంటెంట్ సృష్టికర్తలకు రక్షణ కల్పించాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. పైరసీ కారణంగా సినిమా నిర్మాతలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. కొత్త చట్టం ద్వారా వాటిని నిరోధించడమే లక్ష్యం” అని తెలిపారు.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని టాలీవుడ్, బాలీవుడ్, ఇతర భాషల చిత్ర పరిశ్రమలు అభినందిస్తున్నాయి. పైరసీ వల్ల కలెక్షన్లు తగ్గిపోతున్నాయని, ఓటీటీ ప్లాట్‌ఫామ్లలోకూడా డ్యామేజ్ జరుగుతోందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. కొత్త చట్టంతో పైరసీకి బలమైన అడ్డుకట్ట పడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.