
BJP : వాజ్ పేయ్, అద్వానీ నాటి బీజేపీ కాదా.. ఇంతగా మారిపోయిందేంటి..?
BJP : బీజేపీ అంటే ఒకప్పుడు సిద్దాంతాలకు, నీతికి పెట్టింది పేరు అనేలా ఉండేది. దానికి కారణం అప్పట్లో వాజ్ పేయ్, అదాని లాంటి వారు నడిపించిన తీరు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ విధానాలను చూస్తుంటే గతంలో వాజయ్ పేయ్ ను ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. 1999లో వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు అన్నీ కలిసి అవివ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. ఆ సమయంలో వాజ్ పేయ్ ప్రభుత్వం ఒక్క ఓటుతో అధికారం కోల్పోయింది. ఆ సమయంలో చాలా మంది నేతలు వాజ్ పేయ్ ను కలిశారు.
ఆ ఒక్క ఓటు ఏదో ఒక విధంగా సాదిద్దాం అంటూ తెలిపారు. కానీ వాజ్ పేయ్ ఒప్పుకోలేదు. ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు వెళ్దామని చెప్పి అధికారాన్ని కోల్పోయారు. అందుకే ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీని తిరుగులేని మెజార్టీతో గెలిపించారు. దాంతో ప్రధానిగా మరోసారి వాజ్ పేయ్ మరోసారి పగ్గాలు చేపట్టారు. అలాంటి నిజాయితీ కలిగిన వాజ్ పేయ్ కాలం నాటి నేతలు ఇప్పుడు బీజేపీలో ఉన్నారా అంటే డౌటే అని చెప్పుకోవాలి. ఉదాహరణకు ఏపీ వరకు చూసుకుంటే మోడీ 2019 ఎన్నికల్లో చంద్రబాబును దారుణంగా విమర్శించారు. పోలవరం డబ్బులను ఏటీఎంలా వాడుకున్నారంటూ ఆరోపించారు. అంతే కాకుండా చంద్రబాబు అత్యంత అవినీతి పరుడని చెప్పుకొచ్చారు. వారసత్వ రాజకీయాలను బొంద పెట్టాలని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా మోడీ, అమిత్ షా చెప్పే మాటలు ఇవే. కానీ ఏపీకి వచ్చేసరికి వాటిని తుంగలో తొక్కేశారు. ఒకప్పుడు అవినీతి పరుడు అని ముద్ర వేసిన చంద్రబాబుతోనే ఇప్పుడు మోడీ పొత్తులు పెట్టుకున్నారు.
BJP : వాజ్ పేయ్, అద్వానీ నాటి బీజేపీ కాదా.. ఇంతగా మారిపోయిందేంటి..?
అంతే కాకుండా చంద్రబాబు, లోకేష్ వారసత్వంతో నడుస్తున్న టీడీపీకి ఓట్లేయాలంటూ చెప్పడం ఇక్కడ ఇంకా విడ్డూరం. అది కూడా లోకేష్ ను ప్రేమగా మాట్లాడటం ఇంకా విచిత్రం అనే చెప్పుకోవాలేమో. ఒకప్పుడు ఇలాంటి మాటలు చెప్పిన ప్రధాని మోడీ.. ఇప్పుడు మాత్రం చంద్రబాబుకు జై కొట్టడం ఏంటని అంతా ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడు బీజేపీ జాతీయ నేతలుగా చెప్పుకునే ప్రధాని మోడీకి, అమిత్ షాకు పెద్దగా విలువలు ఉండవనే అర్థం కదా అంటున్నారు ప్రతిపక్ష నేతలు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.