Sukumar : సుకుమార్ కెరీర్ ను మార్చేసిన సినిమా అంటే అందరికీ టక్కున ఆర్య సినిమా గుర్తుకు వస్తోంది. ఆ సినిమా కేవలం సుకుమార్ కు మాత్రమే కాదు.. అటు ప్రొడ్యూసర్ గా దిల్ రాజుకు, హీరోగా అల్లు అర్జున్ కు తిరుగులేని స్టార్ ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. ఈ సినిమా అందరి కెరీర్ ను మార్చి పడేసింది. అందుకే ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఓ స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇందులో ఆర్య సినిమా కోసం పని చేసిన అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ ఆర్య సినిమా గురించి ప్రతి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.ఆయన మాట్లాడుతూ.. మొదటి సినిమా కాబట్టి ఆర్య గురించి అన్ని విషయాలు గుర్తుకున్నాయి. దిల్ సినిమా హిట్ అయితే రాజుగారు నాతో సినిమా చేస్తా అన్నారు. అనుకున్నట్టు గానే దిల్ సినిమా హిట్ కావడంతో ఏ మాత్రం అనుభవం లేని నాతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. అయితే ఆర్య సినిమాకు నేను చాలా పెద్ద టెక్నీషియన్లు కావాలని కోరాను.
దిల్ రాజు గారు వెంటనే నాకు వారిని అరేంజ్ చేశారు. ఇక బన్నీకి కథ చెప్పినప్పుడు ఇందులో తన భవిష్యత్ ఉందని గుర్తించాడు. అందుకే అందరినీ ఒప్పించి మరీ సినిమా చేసి తన కెరీర్ ను తానే వెతుక్కున్నాడు. ఇక ఆర్య సినిమా సమయంలో ఓ మాంటేజ్ సీన్ కావాలని అనుకున్నాను. దాని కోసం దిల్ రాజు గారిని అడిగాను. కానీ ఆయన నాపై అరిచేశాడు. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నావ్, బడ్జెట్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయింది అంటూ కోప్పడ్డారు. దాంతో ఇద్దరం గొడవపడ్డాం. అయితే ఆ తర్వాత నాకు ఎలాగైనా ఆ సీన్ కావాలనిపించింది.
వెంటనే వెళ్లి దిల్ రాజు గారి కాళ్లు పట్టుకున్నాను. ఆర్య సినిమా సమయంలో మూడు సార్లు ఆయన కాళ్లు పట్టుకున్నాను. డైరెక్టర్లు అంటే పొగరుగా ఉంటారని అనుకుంటారు. తేడా వస్తే షూటింగ్ ఆపేసి వెళ్తారని చాలామంది అనుకుంటారు.కానీ నేను సినిమా ఔట్ ఫుట్ బాగా రావడం కోసం ఎంత వరకు అయినా తగ్గుతాను. అందుకే రాజుగారి కాళ్లు పట్టుకున్నాను. సినిమా విడుదలయ్యాక చాలా పెద్ద హిట్ అయింది. అందరి కెరీర్ లను ఈ సినిమా మార్చేసినందుకు నాకు ఇప్పటికీ గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చారు సుకుమార్.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.