సీఎం జ్ఞానగుళికలు రాస్తే పుస్తకాలు అవుతాయి.. తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ ఫైర్ బ్రాండ్
vangalapudi Anitha లోకేశ్ భాషను తప్పుపట్టేవారు, సీఎం నోటి నుంచి జాలువారే జ్ఞానగుళికలపై ఏం సమాధానం చెబుతారు? అంటూ ఒక రేంజు లో ఫైర్ అయ్యింది టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనిత vangalapudi Anitha . దళితోధ్ధారకులమని చెప్పుకుంటున్నసోకాల్డ్ వైసీపీనాయకులు లోకేశ్, చంద్రబాబునాయుడిపై విమర్శలుమానేసి, సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయడంపై దృష్టిపెడితే మంచిది.

vangalapudi Anitha Comments on cm jagan mohan reddy
డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని లోకేశ్ పరామర్శిస్తే గురివింద గింజల్లాంటి కొందరు నాయకులకు ఎందుకంత నొప్పి? లోకేశ్ ని, టీడీపీని తప్పుపట్టే బదులు, సుధాకర్ కుటుంబానికి, ప్రభుత్వంద్వారా ఎలాంటి న్యాయంచేయాలని ఆలోచిస్తే మంచిది? శవరాజకీయాలకు మారుపేరు ఇప్పుడు అధికారంలోఉన్నవారని ప్రజలకు బాగా తెలుసంటూ విరుచుకుపడింది.
శవాన్ని పక్కనపెట్టుకొని సంతకాలు సేకరించింది, బాబాయ్ శవాన్ని బాత్రూమ్ ఉంచిందెవరో ప్రజలకు బాగా తెలుసని, అటువంటి వారు, వారికి కొమ్ముకాసే కొందరు స్వార్థపరులు శవరాజకీయాల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది. లోకేశ్ ను, చంద్రబాబుని ఎవరుబాగా తిడితే వారికి మంత్రి పదవులిస్తానని జగన్మోహన్ రెడ్డిచెప్పాడా? అందుకే కొందరు అడ్డూ అదుపు లేకుం డా నోరుపారేసుకుంటున్నారు.
చివరకు ఆ నాయకుడు వారికి మంత్రిపదవి ఇస్తాడో లేదో తెలియదుగానీ, దానికి ఆశపడినవారికి మాత్రం భంగపాటు తప్పదంటూ విమర్శలు చేసింది అనిత.
లోకేశ్ భాషను తప్పుపట్టేవారు , సీఎం నోటినుంచి జాలువారే జ్ఞానగుళికలపై ఏం సమాధానం చెబుతారు? అవన్నీ చర్చిస్తే పుస్తకాలకు పుస్తకాలే అవుతాయి.నిరారక్షత, అంబులెన్స్ ట్యాంకర్, ద్విచక్రవాహానానికి టోల్ ఫీజుకట్టడం ఇలా చాలానే ఉన్నాయికదా? అవేవీ సోకాల్డ్ వైసీపీనేతలకు గుర్తులేవా? సీఎం లాంటి వ్యక్తే తన జ్ఞానగుళికలతో ఎలాంటి సందేశంప్రజలకు ఇస్తున్నాడో సోకాల్డ్ నేతలు చెప్పాలి. వారే స్వయంగా భాషపై పట్టుపెంచుకోవాలని ముఖ్యమంత్రికి చెబితే సంతోషిస్తామని అనిత ఎద్దేవా చేసింది.