Venu Swamy : వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఎన్ని సీట్లు వస్తాయంటే… వేణు స్వామి…!

Authored By Ramu | The Telugu News | Updated on : 4 March 2024, 12:00 pm
  •  Venu Swamy : వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఎన్ని సీట్లు వస్తాయంటే... వేణు స్వామి...!

Venu Swamy : తెలుగు సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఇక అప్పటినుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో వేణు స్వామి పేరు బాగా వినిపిస్తోంది. దీంతో సెలబ్రిటీలతో సహా సాధారణ ప్రజలు కూడా వేణు స్వామి దగ్గర జాతకాలు చెప్పించుకునేందుకు క్యూ కట్టడం మొదలుపెట్టారు. ఇలాంటి నేపథ్యంలోనే , వేణు స్వామి ఇప్పుడు రాజకీయ నాయకుల గురించి కూడా కొన్ని ఇంటర్వ్యూలలో పలు రకాల విషయాలను బయట పెడుతూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజానికి వేణు స్వామి చేసే వ్యాకలు ప్రతిసారి నిజం అవుతాయా అంటే కాదనే చెప్పాలి. కొన్ని సందర్భాలలో వేణు స్వామి ,చేసిన వ్యాఖ్యలు నిజం కాలేదు. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ , రాజకీయ పార్టీల గురించి రాజకీయ నేతల గురించి , వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ఈసారి , ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు ఒక్క డిపాజిట్ కూడా దక్కదని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉన్న మాట వాస్తవమే కానీ , అభిమానులు ఓట్లుగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ తెలియజేశారు. సినీ యాక్టర్లు ప్రచారాలకు వెళ్ళినప్పుడు వారిని అభిమానించేవారు చాలామంది ప్రచారాలలో పాల్గొంటారు కానీ గ్రౌండ్ వర్క్ లో మాత్రం వారు కనిపించరు అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఇక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోరాటం చేసి ఉంటే కనీసం 20 సీట్లు అన్న దక్కించుకునేవాడని ఇక ఇప్పుడు అవి కూడా దక్కటం కష్టమే అంటూ వేరుస్వామి సంచలన వ్యాఖ్యలుు చేశారు. , అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా గెలుపొంది తీరుతారని వేరు స్వామి బల్లగుద్ది మరి చెప్పారు.

అంతేకాదు ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2024 మరియు , 2029లో జరిగే ఎలక్షన్స్ లో కూడా ఘనవిజయం సాధిస్తారని , హ్యాట్రిక్ సీఎం అవుతారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు విషయానికొస్తే , ఆంధ్ర రాష్ట్రంలో టిడిపి పార్టీ కూడా కనిపిస్తుందో లేదో అనే పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా వేణు స్వామి తెలియజేశారు. అంతేకాక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ లాగా , జగన్మోహన్ రెడ్డిని చూడబోతారంటూ ఈ సందర్భంగా వేణు స్వామి తెలియజేశారు. మరి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపై మీ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Advertisement

Ramu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి