Waqf Amendment : కొత్త వక్ఫ్ బిల్లు ప్రతిపాదనలపై వివాదం ఎందుకు.. అసలు అందులో ఏముంది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Waqf Amendment : కొత్త వక్ఫ్ బిల్లు ప్రతిపాదనలపై వివాదం ఎందుకు.. అసలు అందులో ఏముంది..?

 Authored By ramu | The Telugu News | Updated on :27 November 2024,9:33 pm

ప్రధానాంశాలు:

  •  Waqf Amendment : కొత్త వక్ఫ్ బిల్లు ప్రతిపాదనలపై వివాదం ఎందుకు.. అసలు అందులో ఏముంది..?

Waqf Amendment : పార్లమెంటులో శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ ఆస్తులు, మతపరమైన విషయాల గురించి చర్చిస్తున్నారు. ముస్లీం లకు విరాళంగా ఇచ్చిన భూములు, భవనాలు నిర్వహించే విధానాలు మార్చేందుకు కొత్త ప్రతిపాదనలు తెసుకొస్తున్నారు. ఈ మార్పులు మరింత జవాబుదారీతనంతో పారదర్శకతతో ఉండనున్నాయి. ఐతే కొత్త వక్ఫ్ విల్లు స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందని ప్రతిపక్ష పార్టీలతో పాటు ముస్లీం సమాజం కూడా ఆందోళన చేస్తున్నారు.

Waqf Amendment కొత్త వక్ఫ్ బిల్లు ప్రతిపాదనలపై వివాదం ఎందుకు అసలు అందులో ఏముంది

Waqf Amendment : కొత్త వక్ఫ్ బిల్లు ప్రతిపాదనలపై వివాదం ఎందుకు.. అసలు అందులో ఏముంది..?

Waqf Amendment వక్ఫ్ ఆస్తులు అంటే అసలు ఏంటి

వక్ఫ్ అనేది ఒక అరబిక్ పదం.. దీనికి ఎండోమెంట్ అని అర్ధం వస్తుంది. మతపరమైన సమాజ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ముస్లింలకు విరాళంగా ఇచ్చిన ఆస్తులను తెలియచేస్తుంది. వక్ఫ్‌గా ప్రకటించారు అంటే ఆ ఆస్తి దేవుడికి చెందినట్లు పరిగణిస్తారు. ఐతే ఇది సమాజానికి ప్రయోజనం చేకూర్చడానికి మాత్రమే ఈ ఆస్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. భారతదేశంలో ఉన్న వక్ఫ్ ఆస్తులు అన్ని 1995 వక్ఫ్ చట్టం కిందకు వస్తాయి. ఈ వక్ఫ్ ఆస్తులను రక్షించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఐతే సర్వే కమీషనర్లకు వక్ఫ్ ఆస్తులు గుర్తించి వాటిని ధర్యాప్తు చేసే అధికారం ఉంటుంది. అంటే చట్టవిరుద్ధమైన ఆక్రమణలను నిరోధించడానికి ఈ నియమాలు ఉన్నాయి.

అంతేకాదు ఇలాంటి భూములు అమ్మకాలు లేద బదిలీలు జరగవు. వక్ఫ్ సవరణ బిల్లు 2024 లో ఈ చట్టం పేరు ని మార్చాలని చూస్తున్నారు. వక్ఫ్ ని కస్త యూనిఫైడ్ వక్ఫ్ మేనేమెంట్, ఎంపవర్ మెంట్, అఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ గా చేయాలని చూస్తున్నారు. సరైన డాక్యుమెంటేషన్ లేకపోతే అవి వక్ఫ్ గా పరిగణించే అవకాశం లేదు. ముస్లీంతరులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా నియమించే అవకాశం ఉంది. ఐతే దీనిపై ముస్లీం సంఘాల నుంచి వ్యతిరేకత ఉంది. వారస్వ్త్వానికి ముప్పు.. స్వయం ప్రతిపత్తి కోల్పోవడం లాంటివి జరుగుతాయని వారు చెబుతున్నారు. ఐతే వక్ఫ్ చట్టంలోని మార్పులను ఆమోదించడం అంత సులభమైన పనేమి కాదు. దీనిపై తీవ్రస్థాయిలో చర్చలు జరగనున్నాయి. Waqf Amendment Changes Parliament , Waqf Amendment, Changes, Parliament, Waqf Board

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది